రాయల్ ఎన్ఫీల్డ్ 750 మరియు బజాజ్ డామినర్ మద్య హై స్పీడ్ చేజింగ్

రాయల్ ఎన్ఫీల్డ్ తమ అప్ కమింగ్ 750సీసీ ప్యార్లల్ బైకును రోడ్డు మీద పరీక్షిస్తోంది. ఇదే సమయంలో ఓ బజాజ్ డామినర్ కస్టమర్ తన బైకుతో చేజింగ్ మొదలు పెట్టాడు.

By Anil

సినిమాల్లో లేదంటే స్పోర్ట్స్ రేసింగ్ ఛానళ్లలో చేజింగ్ చూసుంటారు. రియల్ టైమ్ చేజింగ్ ఎప్పుడైనా చూశారా...? మన ఇండియన్ రోడ్ల మీద మన మధ్య ఎక్కువగా తిరిగే రెండు బైకుల మధ్య గరిష్టం వేగంతో చేజింగ్ జరిగితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

రాయల్ ఎన్ఫీల్డ్ తమ అప్ కమింగ్ 750సీసీ ప్యార్లల్ బైకును రోడ్డు మీద పరీక్షిస్తోంది. ఇదే సమయంలో ఓ బజాజ్ డామినర్ కస్టమర్ తన బైకుతో చేజింగ్ మొదలు పెట్టాడు. రద్దీతో కూడా జాతీయ రహదారి మీద గంటకు 165 కిలోమీటర్ల వేగంతో రెండు బైకులు పోటా పోటీగా చేజింగ్ మొదలుపెట్టాయి.

Recommended Video

Triumph Street Triple RS Launch In India | In Telugu - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

ఈ చేజింగ్ మొత్తాన్ని డామినర్ రైడర్ హెల్మెట్ మీద ఫిక్స్ చేసిన కెమెరాలో రికార్డయ్యింది. కొన్ని సంధర్భాల్లో రైడింగ్ అత్యంత ఉత్కంఠంగా సాగింది. అయితే, ఈ రెండింటిలో ఏది గెలిచిందో చెప్పగలరా...? అంచనా వేయడం కష్టంగా ఉంటే క్రింది వీడియో చూడండి.

తాజాగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయిన ఈ వీడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. చెన్నై సమీపంలోని ఓ జాతీయ రహదారి మీద డామినర్ రైడర్ రాయల్ ఎన్ఫీల్డ్ పరీక్షిస్తున్న 750 బైకు అందుకోవడానికి గరిష్ట వేగంతో చేజింగ్ మొదలుపెట్టాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

డామినర్ తన శక్తినంతా కూడగట్టుకుని 161కిమీల వేగంతో రోడ్డు మీద పరుగులు పెట్టింది, అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ 750 ట్విన్ బైకు డామినర్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కొన్ని అవాంతరాల వలన డామినర్ రాయల్ ఎన్ఫీల్డ్‌ను ఓడించింది కూడా.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

అయితే, 373సీసీ ఇంజన్ కెపాసిటి గల డామినర్ 750సీసీ కెపాసిటి ఉన్న బైకుతో పోటీ పడటం అంత తేలికైన విషయమేం కాదు. కానీ బజాజ్ వారి పవర్‌ఫుల్ ఇంజన్‌కు ఇదొక నిలువెత్తు నిదర్శనం.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ ట్విన్ మోటార్ సైకిల్ విషయానికి వస్తే, ఇటలీలోని మిలాన్‌లో 2017 నవంబరులో జరగనున్న ఐక్మా ఆటో షో వేదిక మీద 750సీసీ ఇంజన్ కెపాసిటి గల ఈ బైకును ప్రపంచ ఆవిష్కరణ చేయనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

చెన్నై ఆధారిత దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ దీనిని ఇంటర్‌సెప్టార్ లేదా కాంటినెంటల్ 750 పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది. మరియు రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఇదే అత్యంత శక్తివంతమైన బైకుగా నిలవనుంది. దీనికి ఇండియా మరియు విదేశాల్లో పలురకాల టెస్టింగ్స్ నిర్వహిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ Vs బజాజ్ డామినర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ బైకు పూర్తి స్థాయిలో విడుదలైతే, ఖచ్చితంగా డామినర్, కెటిఎమ్ డ్యూక్‌లు ఏ మాత్రం పోటీపడలేవు. హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్ సైకిల్‌కు పోటీగా ఎన్ఫీల్డ్ ఈ బైకును అభివృద్ది చేస్తోంది.

ఈ దెబ్బతో పెద్ద బైకుల మార్కెట్లో తమ స్థానమేంటో బజాజ్‌కు మంచి గుణపాఠం లభించింది. బజాజ్ ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ 350సీసీ బైకుల మీద టెర్గెట్ చేసే. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్‌ను అందుకోవాలంటే ఇంకా పెద్దగా ఆలోచించాలి.

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Dominar Attempts High-Speed Chase Of Royal Enfield 750cc — Gets Put In Its Place
Story first published: Monday, October 23, 2017, 13:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X