ఈ మోటార్ సైకిల్‌కు విదేశాల్లో పిచ్చి డిమాండ్
బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్‌కు ఇండియన్ మార్కెట్లోనే కాదు, విదేశీ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఎంతలా అంటే, దేశీయంగా బజాజ్ డామినర్ సేల్స్ కంటే ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి.
బజాజ్ ఆటో డామినర్ 400 విడుదలతో మిడ్ సైజ్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. దీంతో 350-500సీసీ కెపాసిటీతో పోటీలేకుండా రాణిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచంలోకి బజాజ్ మెల్లమెల్లగా ప్రవేశిస్తోంది.

ఇప్పుడు బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్‌కు ఇండియన్ మార్కెట్లోనే కాదు, విదేశీ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఎంతలా అంటే, దేశీయంగా బజాజ్ డామినర్ సేల్స్ కంటే ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి.

బజాజ్ డామినర్ డామినర్ 400 మోటార్ సైకిల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.4 లక్షలుగా ఉంది. మరియు ఏబిఎస్ వేరియంట్ డామినర్ ప్రారంభ ధర రూ. 1.55 లక్షలుగా ఉంది. ఈ ధరల శ్రేణిలో లభించడంతో భారత దేశపు అత్యంత సరసమైన మిడ్ సైజ్ బైకుగా నిలిచింది.
Recommended Video


బజాజ్ ప్రతి నెలా 10,000 యూనిట్ల డామినర్ మోటార్ సైకిళ్లను విక్రయించే లక్ష్యంతో ఉంది. ఏదేమైనప్పటికీ, నెలకు 2,000 యూనిట్లను మాత్రమే విక్రయించగలుగుతోంది. సెప్టెంబర్ 2017 లో ఎగుమతులు మరియు ఇండియన్ సేల్స్‌తో కలుపుకొని మొత్తం 4,500 యూనిట్లను విక్రయించింది.

ఇండియాలో 2,000 యూనిట్లను మాత్రమే విక్రయించిన బజాజ్, 2,500 యూనిట్లను ఎగుమతి చేసింది. దీంతో డామినర్ సేల్స్ భారత్ కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం లాటిన్ అమెరికా మరియు ఆగ్నేయాసియా లకు అధికంగా ఎగుమతి చేస్తోంది.

బజాజ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఎగుమతులు ప్రారంభించింది. మరియు అతి త్వరలో యూరోపియన్ మార్కెట్లోకి కూడా ఎగుమతి చేయనుంది. బజాజ్ డామినర్ ఇండియా సేల్స్ కంటే విదేశాలకు జరిగే ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో తెలుసా...?

ఈ సెగ్మెంట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ పటిష్టమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. రాయల్ ఎన్ఫీల్డ్ గత సెప్టెంబర్ 2017లో 70,341 యూనిట్ల ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను విక్రయించింది. కొన్ని దశాబ్దాలు పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సెగ్మెంట్లో ఉండటం బాగా కలిసొచ్చింది.

అయితే, రాయల్ ఎన్ఫీల్డ్‌కు సాధ్యంకాని విధంగా తమ డామినర్‌లో అధునాతన ఫీచర్లను అందించింది. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, మరియు ఇతర ఫీచర్లు డామినర్‌లో ఉండగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో మిస్సయ్యాయి.

బజాజ్ కెటిఎమ్ 390 ప్రేరణతో డామినర్ 400 ను నిర్మించినప్పటికీ, ఇంజన్ ఇంజన్ నిష్పతి మరియు ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీతో 373సీసీ కెపాసిటి గల ఇంజన్‌ను డామినర్‌లో అందించింది. ఇది గరిష్టంగా 34.3బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బజాజ్ డామినర్ 400 మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్‌కు తొలిపోటీగా విపణిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ప్లస్ సేఫ్టీ గల డామినర్ మరియు హిస్టరీ ప్లస్ క్లాసిక్ స్టైల్ గల రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో పోటీలో నెగ్గేదెవరో చూడాలంటే మరికొంత వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications








