బ్లాక్ ప్యాక్ ఎడిషన్‌లో విడుదలైన బజాజ్ పల్సర్ సిరీస్ బైకులు

బజాజ్ ఆటో ఇండియా ఒక కోటి పల్సర్ శ్రేణి బైకులను విక్రయించింది. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా బజాజ్ తమ పల్సర్ సిరీస్ బైకులను బ్లాక్ ప్యాక్ ఎడిషన్‌లో లాంచ్ చేంది.

By Anil

బజాజ్ ఆటో ఇండియా ఒక కోటి పల్సర్ శ్రేణి బైకులను విక్రయించింది. ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా బజాజ్ తమ పల్సర్ సిరీస్ బైకులను బ్లాక్ ప్యాక్ ఎడిషన్‌లో లాంచ్ చేంది.

2018 పల్సర్ 150, పల్సర్ 180 మరియు పల్సర్ 220ఎఫ్ సిరీస్ బైకులను బ్లాక్ ఎడిషన్ పేరుతో స్పెషల్ ఎడిషన్‌లో బజాజ్ విడుదల చేసింది. స్పెషల్ ఎడిషన్ పల్సర్ బైకుల్లో నూతన పెయింట్ స్కీమ్, గ్రాఫిక్స్ మరియు వైట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

బజాజ్ పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకులు

నూతన పెయింట్ స్కీములో భాగంగా మ్యాట్ గ్రే కలర్ హెడ్ లైట్లు, అల్లాయ్ వీల్స్ పల్సర్ శ్రేణి బైకుల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా శాటిన్ క్రోమ్ ఎగ్జాస్ట్ కవర్ వంటివి మూడు పల్సర్ శ్రేణి బైకుల్లో ఉన్నాయి.

Recommended Video

Bangalore City Police Use A Road Roller To Crush Loud Exhausts
బజాజ్ పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకులు

పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ సిరీస్ బైకుల విడుదల సందర్భంగా బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ, "భారతదేశంలో పల్సర్ నెంబర్ వన్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తొలుత 2001లో పల్సర్ విడుదలైంది, ఇప్పుడు 25 దేశాల్లో ఇది విక్రయాల్లో ఉందిని తెలిపాడు."

బజాజ్ పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకులు

"పల్సర్ శ్రేణి మోటార్ సైకిళ్లను పరిచయం చేసినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా కోటి పల్సర్ మోటార్ సైకిళ్లను విక్రయించడం పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ పల్సర్ శ్రేణి మోటార్ సైకిళ్లను బ్లాక్ ప్యాక్ ఎడిషన్‌లో లాంచ్ చేసినట్లు తెలిపాడు."

బజాజ్ పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకులు

అన్ని పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకుల్లో సాంకేతికంగా అవే మునుపటి ఇంజన్‌లతో లభించనున్నాయి. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం బజాజ్ 150సీసీ కెపాసిటి గల పల్సర్ బైకును విడుదల చేసింది. ఇప్పుడు దీనితో పాటు 180సీసీ మరియు 220సీసీ కెపాసిటి గల పల్సర్ సిరీస్ బైకులు అందుబాటులో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ బ్లాక్ ప్యాక్ ఎడిషన్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్లో బజాజ్ పల్సర్ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ బ్రాండ్‌గా నిలిచింది. బజాజ్ ప్రవేశపెట్టే బైకులకు మంచి ఆదరణ లభించడంతో స్కూటర్ల విపణి నుండి శాస్వతంగా నిష్క్రమించింది. బజాజ్ నుండి స్కూటర్ల లైనప్‌లోకి ఒక్క మోడల్ కూడా పరిచయం చేయలేదు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 13, 2017, 9:55 [IST]
English summary
Read In Telugu: Bajaj Pulsar 150, 180, 220 Black Pack Edition Launched In India; Pulsar Series Reaches 1 Crore Sales
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+