జిఎస్‌టి అనంతరం బజాజ్ పల్సర్ బైకుల మీద తగ్గిన ధరలు: క్లుప్తంగా...
బజాజ్ ఆటో టూ వీలర్స్ లైనప్‌లోని పల్సర్ శ్రేణిలోని బైకుల ధరలు తగ్గించింది. తగ్గించిన ధరలు వివరాలు క్లుప్తంగా ఇవాళ్టి కథనంలో.
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నూతన ట్యాక్స్ విధానం జిఎస్‌టికి అనుగుణంగా అన్ని కార్లు మరియు బైకుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను సవరించడం ప్రారంభించాయి. బజాజ్ ఆటో టూ వీలర్స్ లైనప్‌లోని పల్సర్ శ్రేణిలోని బైకుల ధరలు తగ్గించింది.

జిఎస్‌టికి మునుపు, జిఎస్‌టి అనంతరం పల్సర్ శ్రేణిలోని అన్ని బైకుల ధరలతో పాటు తగ్గించిన ధరల వివరాలు క్లుప్తంగా. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
| మోడల్ | GST-ముందు | GST-అనంతరం | ధర వ్యత్యాసం |
| పల్సర్ 135ఎల్ఎస్ | రూ.61,177లు | రూ.60,705లు | రూ. 472 లు |
| పల్సర్ 150 | రూ.75,604లు | రూ.74,975లు | రూ.629లు |
| పల్సర్ 180 | రూ.80,546లు | రూ.79,893లు | రూ.653లు |
| పల్సర్ 220ఎఫ్ | రూ.92,200లు | రూ.91,555లు | రూ.645లు |
| పల్సర్ ఎన్ఎస్200 | రూ.97,452లు | రూ.96,747లు | రూ.705లు |
| పల్సర్ ఆర్ఎస్200(నాన్-ఏబిఎస్) | రూ.122,881లు | రూ.121,891లు | రూ.990లు |
| పల్సర్ ఆర్ఎస్200(ఏబిఎస్) | రూ.134,882లు | రూ.133,744లు | రూ. 1,138లు |

తగ్గించబడిన అన్ని ధరలు ఢిల్లీగా ఆధారంగా ఇవ్వబడ్డాయి. వివిధ రాష్ట్రాలు మరియు నగరాల ఆధారంగా ధరల తగ్గింపులో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం బజాజ్ పల్సర్ లైనప్‌లో 135ఎల్ఎస్, పల్సర్ 150, పల్సర్ 180, 220ఎఫ్, ఎన్ఎస్200, ఆర్ఎస్200 వంటి మోడళ్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జిఎస్‌టి అమలు ద్వారా కలిగే ప్రయోజనాలను బజాజ్ తమ టూ వీలర్లపై ధరల తగ్గింపు రూపంలో అందిస్తోంది. బజాజ్ టూ వీలర్లను కొనుగోలు చేయడానికి ఇదొక మంచి సమయం అని చెప్పవచ్చు. ఆలస్యం చేస్తే జిఎస్‌టి ద్వారా తగ్గిన ధరలు, తయారీదారులు పెట్టుబడు ఖర్చుల నెపంతో మళ్లీ పెంచే అవకాశం కూడా లేకపోలేదు.


Click it and Unblock the Notifications








