NS160 బైకును పరీక్షిస్తున్న బజాజ్: విడుదల మరియు ఇతర వివరాలు
భారత దేశపు దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ సరికొత్త పల్సర్ NS160 బైకును పరీక్షిస్తోంది. పల్సర్ ఎన్ఎస్200 మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ 160 వేరియంట్ విడుదల చేసే ఆలోచనలో ఉంది.
భారత దేశపు దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ సరికొత్త పల్సర్ NS160 బైకును పరీక్షిస్తోంది. పల్సర్ ఎన్ఎస్200 మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ 160 వేరియంట్ విడుదల చేసే ఆలోచనలో ఉంది.

త్వరలో విడుదల ఉండటంతో దీనిని ఇండియన్ రోడ్ల మీద ఇప్పటికే పలుమార్లు పరీక్షించింది బజాజ్. సీక్రెట్‌గా కాకుండా పబ్లిక్‌గానే రోడ్ల మీద పరీక్షించింది. తొలుత ఇది ఏ బైకో తెలియకపోయినా, చివరికి పల్సర్ ఎన్ఎస్160 అని స్పష్టం అయ్యింది.

డిజైన్ మొత్తాన్ని పరిశీలిస్తే, పల్సర్ ఎన్ఎస్160 అచ్చం ఎన్ఎస్200 డిజైన్‌ను పోలి ఉంది. అయితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్ మిస్సయ్యాయి.

బజాజ్ ఈ సరికొత్త ఎన్ఎస్160లో ఆయిల్‌తో కూల్ అయ్యే 160.3సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది 15బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ ఆటో NS160 బైకును ముందు వైపు సింగల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో టర్కీ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే తక్కువ ధరతో అందించేందుకు దేశీయంగా రానున్న మోడల్‌లో ఏబిఎస్ మిస్సయ్యే అవకాశం ఉంది.

బజాజ్ దీనిని పూర్తిస్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే, ప్రస్తుతం విపణిలో ఉన్న సుజుకి జిక్సర్, యమహా ఎఫ్‌జడ్ ఎఫ్ఐ2.0 మరియు హోండా సిబి హార్నెట్ 160ఆర్ లకు గట్టిపోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
బజాజ్ ఆటో ఇప్పటికే విసృత ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. 160సీసీ సెగ్మెంట్లో రాణించేందుకు జపాన్ సంస్థలైన సుజుకి, హోండా మరియు యమహాలతో పోటీకి దిగుతోంది. సరసమైన ధరలతో బైకులను విక్రయిస్తున్న సంస్థగా పేరుగాంచిన బజాజ్ ఈ ఎన్ఎస్160 ధరను ఏ మేరకు నిర్ణయిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications








