బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 విడుదల: ధర మరియు ఇంజన్ వివరాలు

బజాజ్ ఆటో విపణిలోకి 2017 పల్సర్ ఆర్ఎస్200 మోటార్ సైకిల్‌ను బిఎస్‌-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు నూతన కలర్ ఆప్షన్‌లతో విడుదల చేసింది.

By Anil

బజాజ్ ఆటో తమ ఫ్లాగ్‌షిప్ లోని పల్సర్ శ్రేణికి ఇప్పుడు అప్‌గ్రేడ్స్ నిర్వహిస్తోంది. 2017 మోడల్‌గా నూతన పల్సర్ ఆర్ఎస్200 లో భారత్ స్టేజ్ - IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ అందించి మరియు నూతన కలర్ ఆప్షన్లను జోడించింది.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ బ్లూ మరియు గ్రాఫైట్ బ్లాక్ అనే రెండు విభిన్న రంగుల్లో విడుదలైంది. ఇదే వేరియంట్‌ పేరుతో గతంలో అందుబాటులో ఉన్న మోడళ్లను మరియు పాత రంగులను పూర్తిగా ప్రక్షాళన చేసింది.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ముందు వైపున ఫ్రంట్ ఫోర్క్స్‌కు సమీపాన నీలం మరియు బూడిద రంగులో ఉన్న సొబగులలను గుర్తించవచ్చు మరియు అద్బుతమైన లుక్‌ను సంతరించుకునేందుకు గాను వెనుక వైపున టెయిల్ సెక్షన్ అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

రేసింగ్ బ్లూ వేరియంట్ ముందు వైపున నీలం రంగులో ఉన్న అల్లాయ్ చక్రాలను మరియు వెనుక వైపున నలుపు రంగులో ఉన్న అల్లాయ్ చక్రాలు కలవు.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

సాంకేతికంగా 2017 పల్సర్ ఆర్ఎస్200 మోటార్ సైకిల్‌లో 199.5సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 24బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ట్రిపుల్ స్పార్క్ గల ఈ ఇంజన్ భారత్ స్టేజ్ - IV ఉద్గార నియమాలను పాటిస్తుంది. ఈ పల్సర్ ఆర్ఎస్200 మోటార్ సైకిల్ యాంటిలాక్ బ్రేకింగ్‌సిస్టమ్ (ABS) మరియు నాన్ ఏబిఎస్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

  • పల్సర్ ఆర్ఎస్ 200 నాన్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1,21,881 లు
  • పల్సర్ ఆర్ఎస్ 200 ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1,33,883 లు
  • రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
    2017 బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

    ఈ విడుదల కార్యక్రమంలో బజాజ్ మోటార్ సైకిల్స్ ఆటో లిమిటెడ్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ, 2017 లో విడుదలైన పల్సర్ ఆర్ఎస్200 అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన ఫీచర్లతో మోటార్ సైక్లింగ్ ఔత్సాహికులను అమితంగా ఆకర్షిస్తుందని పేర్కొన్నాడు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 7, 2017, 12:02 [IST]
English summary
2017 Bajaj Pulsar RS200 Launched With BS-IV Engine; Priced At Rs 1,21,881
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+