బజాజ్ వి12 డిస్క్ బ్రేక్ వేరియంట్ విడుదల: ధర రూ. 60,000 లు
బజాజ్ ఆటో తమ వి12 బైకును డిస్క్ బ్రేకు వేరియంట్లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ అందివ్వగా, వెనుక వైపున ఎలాంటి మార్పులు జరగలేదు.
బజాజ్ తొలుత ఐన్ఎస్ విక్రాంత్ లోహంతో వి12 బైకును డ్రమ్ బ్రేక్ వేరియంట్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే కస్టమర్లు వి12 బైకును డిస్క్ బ్రేక్ వేరియంట్లో కోరుకుంటుండటంతో బజాజ్ వి12లోని ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ జోడించి విపణిలోకి విడుదల చేసింది.

సరికొత్త డిస్క్ బ్రేక్ వేరియంట్ బజాజ్ వి12 ధర రూ. 60,000 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. గతంలో ఉన్న డ్రమ్ బ్రేక్ వేరియంట్ కన్నా దీని ధర రూ. 3000 ల వరకు ఎక్కువగా ఉంది.

డిస్క్ బ్రేక్ అందివ్వడం మినహాయిస్తే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటుచేసుకోలేదు. సాంకేతికంగా ఇందులో 124.45సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ డిటిఎస్-ఐ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 10.5బిహెచ్‌పి పవర్ మరియు 10.9ఎన్ఎమ్ టార్క్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

వి12 మోడల్‌కు తోబుట్టువుగా చెప్పుకునే తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన వి సిరీస్‌లోని వి15 బైకు నుండి వి12 అనేక విడి భాగాలను పంచుకుంది. వి12లో నలుపు రంగులో ఉన్న మడ్ గార్డ్, సన్నగా ఉన్న ట్యూబ్ లెస్ టైర్లు, మరియు 30ఎమ్ఎమ్ వరకు సన్నగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్ ఇందులో ఉన్నాయి.

బజాజ్ వి12 లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఎల్ఇడి టెల్ లైట్లు రాలేకపోయాయి. మొత్తం 133 కిలోలు బరువున్న ఇందులో 13-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు.


Click it and Unblock the Notifications








