టోర్నడో 302ఆర్ బైకును ఇండియా విడుదలకు సిద్దం చేసిన బెనెల్లీ
దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ తమ టోర్నడో 3020ఆర్ మోటార్ సైకిల్‌ను ఇండియాలో విడుదలకు సిద్దం చేస్తోంది. ఇంజన్, ధర, ఫీచర్లు మరియు పూర్తి వివరాలు...
బెనెల్లీ టోర్నడో 302ఆర్ మోటార్ సైకిల్‌ను ఇండియా విడుదలకు సిద్దం చేసుకుంది, ఇందుకు ఈ ఏప్రిల్ 2017 లో విడుదల షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. 3.2 నుండి 3.5 లక్షల మధ్య ధరతో ఎక్స్ షోరూమ్ డిల్లీగా విడుదల చేసే అవకాశం ఉంది.

బెనెల్లీ ఈ టోర్నోడో 302ఆర్ మోటార్ సైకిల్‌ను మొదటి సారిగా 2015 ఎకిమా మోటార్ సైకిల్ షో ఆ తరువాత 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

బెనెల్లీ ఈ 302ఆర్ ఫెయిర్ స్పోర్ట్స్ బైకును సరికొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు స్వింగ్ ఆర్మ్ ఆధారంగా నిర్మించింది. అయితే ఈ రెండింటిని పాత కాలం నాటి ఇరుసు(తిరిగే చిల) తరహా అనుసంధానించడం జరిగింది. తద్వారా ఇంజన్ ఒక అంతర్గత పార్ట్‌గా బైకులో ఇముడిపోతుంది.

టిఎన్‌టి 300 యొక్ నేక్డ్ వెర్షన్‌గా చెప్పుకునే టోర్నడో 302ఆర్ బైకు బరువు దానికన్నా 16 కిలోలు తక్కువగా ఉంటుంది. దీనికి ముందు వైపున 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున స్వింగ్ ఆర్మ్‌కు కాస్త దిగువన ప్రిలోడ్ అడ్జెస్టబుల్ షాక్ అబ్జార్వర్ కలదు.

బ్రేకుల పరంగా చూస్తే, ముందు వైపున 4-పిస్టన్ కాలిపర్ గల 260ఎమ్ఎమ్ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ కాలిపర్ గల 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

ఈ 302ఆర్ బైకులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది, మెట్జలర్ టైర్లు మరియు 17-అంగుళాల పరిమాణం గల అల్లాయ్ వీల్స్‌ను ఇది కలిగి ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, బెనెల్లీ టోర్నడొ 302ఆర్ మోటార్ సైకిల్‌లో 300సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లల్ ట్విన్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 35బిహెచ్‌పి పవర్ మరియు 27ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బెనెల్లీ ఈ టోర్నడో 302ఆర్ మోటార్ సైకిల్‌ను రూ. 3.2 నుండి 3.5 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

50 ఏళ్లు పూర్తి చేసుకున్న హోండా మంకీ బైకు :లిమిటెడ్ ఎడిషన్ విడుదల
నానా బీభత్సం చేసిన మహీంద్రా ఇ2ఒ ఎలక్ట్రిక్ కారు
క్రెటా కు పోటీగా మహీంద్రా నుండి నూతన SUV


Click it and Unblock the Notifications








