క్రూయిజర్ బైకు ప్రేమికులకు బెనెల్లీ నుండి గుడ్ న్యూస్
ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ ఇండయన్ రోడ్ల మీద తమ సరికొత్త క్రూయిజర్ మోటార్ సైకిల్‍ను రహస్యంగా పరీక్షిస్తూ మీడియా కంటపడింది.
ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ ఇండయన్ రోడ్ల మీద తమ సరికొత్త క్రూయిజర్ మోటార్ సైకిల్‍ను రహస్యంగా పరీక్షిస్తూ మీడియా కంటపడింది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న మోటోబి-250 క్రూయిజర్ బైకును పూనేలో పరీక్షించింది.

బెనెల్లీ తమ మోటోబి-250 క్రూయిజర్ మోటార్ సైకిల్ మొత్తాన్ని తెలుపు మరియు నలుపు చారలున్న పేపర్‌తో కప్పేసి పరీక్షించింది. బెనెల్లీ దీనిని ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విక్రయిస్తోంది. అక్కడ దీని ధర Rp 35,600,0000 గా ఉంది, ఇండియన్ కరెన్సీలో దీని విలువ 1.7 లక్షల రుపాయలు.
Recommended Video


సాంకేతికంగా మోటోబి-250 క్రూయిజర్ మోటార్ సైకిల్‌లో బెనెల్లీ 251.8సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లర్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ అందించింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 17.4బిహెచ్‌పి పవర్ మరియు 16.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

బ్యాసినెట్ టైప్ ఫ్రేమ్ ఆధారంతో మోటోబి-250 బైకును నిర్మించడం జరిగింది. ఇందులో ముందు వైపు సింగల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున డిస్క్ బ్రేక్ కలదు. ఇందులో పరీక్షిస్తున్న మోడల్‌లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ మిస్సయ్యింది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 14 లీటర్లుగా ఉంది.

2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త మోటార్ సైకిళ్లను విడుదల చేయాలని డిఎస్‌కె బెనెల్లీ ఇప్పటికే నిర్ణయించుకుంది. కాబట్టి మరికొన్ని నెలల్లో బెనెల్లీ మోటోబి-250 విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డిఎస్‌కె బెనెల్లీ ఇండియాలో పరీక్షిస్తున్న మోటోబి-250 మోడల్ ప్రొడక్షన్ రెడీ మోడల్ అని తెలుస్తోంది. ఇప్పటికే, ఇండోనేషియాలో విపణిలో ఉంది కాబట్టి, ప్రొడక్షన్ మరియు విడుదల కాస్త వేగంగా జరిగే అవకాశ ఉంది. ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానున్న ఇది బజాజ్ అవెంచర్ 220, యుఎమ్ రెనిగేడ్ కమాండో మరియు హోయసంగ్ అక్విలా 250 మోటార్ సైకిళ్లకు గట్టి పోటినివ్వనుంది.


Click it and Unblock the Notifications








