బైకు ఎలా దొంగలిస్తారో వివరించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకు దొంగలు

Written By:

వాహన చోరీ భారత్‌లో ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. అందులో టూ వీలర్ల దొంగతనాలకు లెక్కేలేదు. ఫోర్ వీలర్లతో పోల్చుకుంటే టూ వీలర్లను దొంగలించడం ఎంతో తేలిక కావడంతో దొంగలు కూడా టూ వీలర్లను దొంగలించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

అయితే, ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ బైకును దొంగతనం చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా...? బైకులను ఎంత సులభంగా దొంగతనం చేయవచ్చో అని పోలీసుల విచారణలో ఓ దొంగల ముఠా వెల్లడించిన వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అంటే సక్రమంగా కొనుగోలు చేసే కస్టమర్లకే కాదు, అక్రమంగా దోచేసే దొంగలకు కూడా మక్కువే. అందుకే ఈ మధ్య కాలంలో దొంగలు ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల మీద టార్గెట్ చేస్తున్నారు.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

ఈ మధ్య కాలంలో బెంగళూరు పోలీసులు ఓ ఎన్ఫీల్డ్ బైకుల దొంగతనం చేసే ముఠాను పట్టుకున్నారు. ఎప్పటిలాగే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు. అయితే, భవిష్యత్తులో బైకు దొంగతనాలను అరికట్టడానికి పోలీసులు దొంగల మీద సరికొత్త విచారణ జరిపారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

ఈ విచారణలో ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ బైకును దొంగలించడానికి 30 సెకండ్ల సమయం చాలని దొంగలు వివరించారు. హ్యాండ్ లాక్ మరియు వైర్లను తొలగిస్తే బైకును స్టార్ట్ చేయడం దాదాపు సులభమే. సింపుల్ చిట్కాలతో బైకు హ్యాండిల్ లాక్‌ను తొలగించి ఇంజన్ స్టార్ట్ కోసం ఉన్న కేబుల్స్ తొలగించి డైరక్ట్ చేస్తారు.

లాక్ ఉన్న వ్యతిరేక దిశలో గట్టిగా హ్యాండిల్ బార్ మీద బలాన్ని ప్రయోగిస్తే, లాక్ నుండి హ్యాండిల్ ఫ్రీగా కదులుతుంది. తరువాత వైర్లలో ఇంజన్ ఇగ్నిషన్ కోసం ఉన్న కేబుల్‌ను డైరక్ట్ చేసి కిక్ స్టార్ట్ చేస్తే బైకు స్టార్ట్ అయిపోతుందని దొంగలు తెలిపారు. ఈ మొత్తాన్ని పోలీసుల ముందు ఓ బైకుతో వివరించి చెప్పడం గమనార్హం.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

అచ్చం ఇలాగే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల దొంగల ముఠా ఎన్నో బైకులను స్వాహా చేసేశారు. జనసంచారం, వీధి దీపాలు లేని ప్రాంతంలో పార్క్ చేసిన బైకులే వీరి టార్గెట్. అయితే, పోలీసులు గమనిస్తున్నారనే విషయాన్ని మరచిన దొంగలు బైకును దోచే పనిలో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

బైకు దొంగల నుండి మీ బైకులను ఇలా కాపాడుకోండి...

రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఒక్కోటి లక్షకు పైనే ఉంటుంది. ఎంతో ఇష్టంగా కొనుకున్న బైకు రాత్రికి రాత్రే మాయమైతే ఎంత బాధగా ఉంటుందో. కాబట్టి, మీ బైకును సేఫ్‌గా, దొంగతనం కాకుండా ఉంచుకోవడానికి మీ కోసం కొన్ని చిట్కాలు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

డిస్క్ లాక్:

డిస్క్ లాక్ ఒక చిన్నపాటి మెకానిజం. దీనిని డిస్క్ బ్రేక్ మీద ఉన్న హోల్స్ ద్వారా లాక్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా చక్రం ముందు కదలడానికి వీలుపడదు. దీని ద్వంసం చేయాలన్నా సమయం పడుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

టైర్ లాక్:

డిస్క్ బ్రేకులు లేని బైకులకు టైర్ లాక్ ప్రత్యామ్యాయంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా తాళంలానే ఉంటుంది. ముందు చక్రాల వద్ద ఫ్రంట్ ఫోర్క్ మీద అటాచ్ చేస్తారు. బైక్ పార్క్ చేసినపుడు టైర్ లాక్ చేయవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

బ్రేక్ లాక్:

ఒక విధంగా చెప్పాలంటే కార్లలో హ్యాండ్ బ్రేక్ తరహా పనిచేస్తుంది. అంటే బైక్ పార్క్ చేసినపుడు బ్రేక్ లాక్ చేస్తే, బ్రేకులు చక్రాలన గట్టిగా పట్టి ఉంచుతాయి. కాబట్టి హ్యాండిల్ బార్ తొలగించినా... బైకు స్టార్ట్ చేసిన ఈ లాక్స్‌తో బైకును భద్రం చేసుకుంటే దొంగల ప్రయత్నాలను విఫలం కావడం గ్యారంటీ.

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొంగలు

జీపీఎస్ డివైజ్:

మీ బైకులో రహస్య ప్రదేశంలో జీపిఎస్ డివైజ్ అమర్చుకోవడం ద్వారా బైకు చోరీకి గురైనప్పటికీ, అది ఏ లోకేషన్‍‌లో ఉందో సులభంగా గుర్తించవచ్చు. అయితే, మార్కెట్లో నాణ్యతలేని జీపీఎస్ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బైకు సరిగ్గా దొంగతనానికి గురైనపుడు అది పనిచేయడం మానేస్తే అంతే సంగతులు కాబట్టి మంచి బ్రాండెడ్ జీపీఎస్ డివైజ్ తీసుకుని బైకులో ఫిక్స్ చేయండి.

English summary
Read In Telugu: Bike thieves show how easy it is to steal a royal enfield

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark