సంచలనం సృష్టిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ స్కూటర్: ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఊపిరి!

Written By:

బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తమ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. అర్బన్ అవసరాలకు ఎక్కువగా వినియోగించే జీరో ఎమిషన్ టూ వీలర్‌ను భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరించింది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

బిఎమ్‍‌డబ్ల్యూ మోటోరాడ్ విజన్ నెక్ట్స్ 100 మోడల్ డిజైన్ ఆధారంతో దీనిని రూపొందించడం జరిగింది. అర్బన్ అవసరాలకు ఉపయోగపడే ఈ స్కూటర్‌లో డిజిటల్ కనెక్టివిటి ఫీచర్ అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

బిఎమ్‌డబ్ల్యూ సరికొత్త కాన్సెప్ట్ లింక్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని మోటార్‌కు స్కూటర్ బాడీ అడుగు భాగంలో పెద్ద పరిమాణంలో సమాంతరంగా ఉన్న బ్యాటరీల ద్వారా పవర్ అందుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ డిజైన్ హెడ్ ఎడ్గర్ హెన్రిచ్ మాట్లాడుతూ," తక్కువ సమయంలో, తక్కువ డిజైన్ లక్షణాలో కాన్సెప్ట్ రూపంలో అభివృద్ది చేసిన ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొత్త శకానికి నాంది పలికిందని పేర్కొన్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

బిఎమ్‌డబ్ల్యూ మాట్లాడుతూ, దీనిని ప్రత్యేకించి సిటీ రోడ్లకు కోసం రూపొందించడం జరిగింది. స్కూటర్ మీద సులభంగా కూర్చోవడం, దిగడం మరియు తక్కువ ఎత్తు, బరువుతో నిర్మించడం ద్వారా ట్రాఫిక్ మరియు ఇరుకైన రోడ్లలో సురక్షితంగా ట్రావెల్ చేయవచ్చని తెలిపింది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

అదనంగా ఈ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ అత్యంత వేగంగా యాక్సిలరేషన్ అందుకుంటుంది. మరియు హ్యాండ్లింగ్ అత్యంత సులభంగా ఉంటుంది. సిటీ రైడింగ్ కోసం ఉండాల్సిన దాదాపు అన్ని ప్రముఖ ఫీచర్లను ఇందులో కల్పించడం జరిగింది. అందులో ఒకటి, రివర్స్ గేర్.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

స్పోర్టివ్ రైడింగ్ చేసేటపుడు సింగల్ సీటు మరియు ఇద్దరు ప్రయాణించడానికి డ్యూయల్ సీటుగా ఇందులోని సీటు మార్చుకోవచ్చు. మరియు కావాల్సిన ఎత్తు ఆధారంగా సీటు ఎత్తు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. సీట్ క్రింది భాగంలో స్టోరేజీ సామర్థ్యాన్ని కూడా కల్పించారు.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

స్టైలింగ్ పరంగానే కాదు బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ లింక్ ఫీచర్ కలిగి ఉంది, అంటే రైడర్ ఇచ్చే ముందస్తు సమాచారాన్ని గ్రహించి, రైడర్ ఎక్కడెక్కడకు వెళ్లాలో అనే సమాచారాన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటుంది. మన గమ్యస్థానాలకు అనువైన రూట్లను గుర్తిస్తుంది. సంధర్భానుసారంగా మనకు కావాల్సిన మ్యూజిక్ ప్లే చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఈ స్కూటర్‌లో మరే ఇతర స్కూటర్లలో లేని విధంగా కాన్సెప్ట్ లింక్ ఫీచర్ అందించింది బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్. కానీ అన్ని స్కూటర్లలో సాంప్రదాయంగా వస్తున్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అందివ్వలేదు.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

స్పీడ్ రేంజ్ మరియు మరియు న్యావిగేషన్ వంటి ప్రాథమిక సమాచారాన్ని పొందడానికి విండ్ స్క్రీన్ హెడ్స్ అప్ డిస్ల్పే అందివ్వడం జరిగింది. అదనపు సమాచారం కోసం సెకండరీ ప్యానెల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చ.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

స్కూటర్ మీద ఉన్న బటన్లు ముందుగానే ప్రోగ్రామ్ చేయబడినవి మరియు వీటిని మన తరచూ వినియోగించే అవసరాలను సెట్ చేసుకుని సేవ్ చేయవచ్చు. ఈ స్కూటర్లో ఉన్న మరో విభిన్నమైన ఫీచర్ రైడర్ వస్త్రధారణను కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే రైడర్ ధరించిన దుస్తులు, రైడింగ్ సమయంలో వాటి కదలికలను పసిగట్టి రైడర్‌కు సూచనలు ఇస్తూ ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఈ విప్లవాత్మక స్కూటర్‌ను కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు తీసుకెళ్లడాన్ని గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇందులో పరిచయం చేసిన అత్యాధునిక ఫీచర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో సంచలనం సృష్టించే డిజైనింగ్ లక్షణాలను గమనిస్తే భవిష్యత్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌కు ఇదే ఊపిరి కానుంది.

బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ లింక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

మాసేరటి క్వాట్రోపోర్ట్ ఇటాలియన్ ‌కారును టెస్ట్ డ్రైవ్ చేసిన డ్రైవ్‌స్పార్క్ తెలుగు:మాసేరటి క్వాట్రోపోర్ట్ జిటిఎస్ టెస్ట్ డ్రైవ్ రివ్య

English summary
Read In Telugu BMW Concept Link Electric Scooter Revealed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark