విపణిలోకి డుకాటి పనిగాలే బైకు విడుదల: ధర రూ. 59.18 లక్షలు

Written By:

ఇటాలియన్‌కు చెందిన స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ డుకాటి తమ 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్ బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైకు ధర రూ. 59.18 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు డుకాటి ఇండియా ప్రతినిధులు వెల్లడించారు.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

స్పోర్ట్స్ బైకుల్లో వి4 ఇంజన్‌లను అందివ్వడానికి డుకాటి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో 1299 పనిగాలే ఆర్ మోటార్ సైకిల్‌ను ఎల్-ట్విన్ ఇంజన్‌తో చివరి ఎడిషన్‌గా అందిస్తోంది. అందుకోసం ఎల్-ట్విన్ ఇంజన్‌ శకానికి ముగింపు పలుకుతూ ఫైనల్ ఎడిషన్ అనే పేరుతో పనిగాలే బైకును విడుదల చేసింది.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

పనిగాలే సిరీస్‌లో ఎల్-ట్విన్ ఇంజన్‌లకు శాస్వతంగా ముగింపు పలకనుంది డుకాటి. ఈ పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్‌ తరువాత వి4 ఇంజన్‌లతో కొత్త సిరీస్ స్పోర్ట్స్ బైకులను నవంబర్ నుండి ప్రవేశపెట్టనుంది.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్ స్పోర్ట్స్ బైకులో 1285సీసీ సామర్థ్యం ఉన్న సూపర్ క్వాడ్రో ఎల్-ట్విన్ ఇంజన్ కలదు. ఇది ఇంజన్ వేగం 11,000ఆర్‌పిఎమ్ వద్ద 206.5బిహెచ్‌పి పవర్ మరియు 9,000ఆర్‌పిఎమ్ వద్ద 142ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

ఫైనల్ ఎడిషన్ పనిగాలే బైకులో అక్రపోవిక్ సంస్థ తయారు చేసిన టైటానియమ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. డబ్ల్యూఎస్‌బికె రేస్ బైకుల్లోని ట్విన్ హై-లెవల్ ఎగ్జాస్ట్ తరహా శబ్దాన్నిచ్చే ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ యూరో-4 ఉద్గార నియమాలను పాటిస్తుంది.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్‌ బైకులో డై-క్యాస్ట్ అల్యూమినియమ్ మోనోకోక్యూ ఛాసిస్ కలదు, ఓహ్లిన్స్ కంపెనీ సస్పెన్సన్ సిస్టం కలదు- ముందు వైపున అడ్జెస్టబుల్ స్టీరింగ్ డ్యాంపర్ గల 43ఎమ్ఎమ్ నిక్స్ 30 అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున టిటిఎక్స్3 మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

రోడ్డు మీద దూసుకెళ్లే టూ వీలర్ రాకెట్ పనిగాలే స్పోర్ట్స్ బైక్ వేగాన్ని కంట్రోల్ చేయడానికి ముందు వైపున బ్రెంబో వారి నాలుగు పిస్టన్ల మోనోబ్లాక్ ఎమ్50 కాలిపర్లు గల 330ఎమ్ఎమ్ సెమి ఫ్లోటింగ్ డిస్క్‌ బ్రేకులు కలవు మరియు వెనుక వైపున రెండు పిస్టన్ల కాలిపర్స్ గల 245ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

డుకాటి పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్‌లో ఇరు వైపులా 17-అంగుళాల పరిమాణం డబ్ల్యూ ఆకారంలో ఉన్న 3-స్పోక్ లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి పిరెల్లీ డియాబ్లో సూపర్ కోర్సా ఎస్‌పి టైర్లు ఉన్నాయి(టైర్ల కొలతలు: ఫ్రంట్ వీల్‌కు 120/70 జడ్ఆర్ 17 మరియు రియర్ వీల్‌కు 200/55 జడ్ఆర్17).

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్

డుకాటి 1299 పనిగాలే ఆర్ ఫైనల్ ఎడిషన్‌ను ఇటాలియన్ ప్లాగ్ లోని రంగులు గ్రీన్, వైట్ మరియు గ్రీన్ రంగులతో ట్రై కలర్ పెయింట్ స్కీమ్‌ను అందించింది. ఎల్-ట్విన్ ఇంజన్‌ శకానికి ముగింపు పలుకుతూ విడుదలైన ఫైనల్ ఎడిషన్ పనిగాలే చాలా అరుదైన మోడల్‌గా నిలవనుంది.

English summary
Read In Telugu: Ducati 1299 Panigale R Final Edition Launched In India At Rs 59.18 Lakh
Story first published: Friday, July 14, 2017, 18:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark