ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా: రూ. 1.12 కోట్లకు విక్రయించిన డుకాటి

Written By:

సాధారణంగా లక్ష రుపాయల బైక్ అంటే అంత ఖరీదా అనే వాళ్లు చాలా మందే ఉంటారు. కానీ 10 నుండి 20 లక్షల ఖరీదైన బైకులను చూసినపుడు వామ్మో అని నోరెళ్లబెడతారు. కానీ నేటి కథనంలోని బైకు ధర చూస్తే షాక్ అవడం ఖాయం.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

డుకాటి అత్యంత ఖరీదైన 1299 సూపర్ లెగ్గెరా అనే బైకు ప్రపంచ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర ఇండియాలో అక్షరాలో కోటి పన్నెండు లక్షల రుపాయలు. ఇదే ధరకు బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ మరియు మసేరాటి కంపెనీల కార్లను కొనచ్చు. అంతటి ఖరీదైన బైకును ఎవరు కొంటారు అని చాలా మంది అనుకోవచ్చు.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

డుకాటి ఇండియా విభాగం, దేశీయంగా 1299 సూపర్ లెగ్గెరా బైకును విక్రయించింది. ఇండియన్ మార్కెట్లోకి విక్రయించిన తొలి 1299 సూపర్ లెగ్గెరా కూడా ఇదే. ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎమ్‌డి విక్రమ్ ఒబేరాయ్ దీనిని కొనుగోలు చేశాడు.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

అరుదైన బైకు అనే ముద్ర వేయడానికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు డుకాటి ప్రకటించింది. అయితే బుకింగ్స్ ప్రారంభించిన తరువాత 500 యూనిట్ల 1299 సూపర్ లెగ్గెరా బైకులు బుక్ అయిపోయాయి.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

అందులో 209 బుకింగ్ నెంబర్‌తో ఒబేరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ ఒబేరాయ్ 1299 సూపర్ లెగ్గెరా బైకును బుక్ చేసుకున్నాడు. ఇండియాలో ఈ బైకు కొనుగోలు చేసిన ఏకైక వ్యక్తి ఇతనే, మరియు ఇండియాలో ఉన్న ఏకైక సూపర్ లెగ్గెరా కూడా ఇదే.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

కోటి పన్నెండు లక్షల రుపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి ఇందులోని ప్రత్యేక ఏమిటి అని అడిగేవారు చాలా మంది ఉంటారు. సాంకేతికంగా ప్రస్తుతం ఉన్న అన్ని బైకుల కంటే ఇది అడ్వాన్స్‌డ్ బైక్. మరియు ప్రపంచ వ్యాప్తంగా లభించే అరుదైన బైకుగా నిలవడం దీని మరో ప్రత్యేకత. తన దగ్గర ఉన్నది మరెవరి దగ్గరా ఉండకూడదు అని భావించే వారికోసమే డుకాటి దీనిని రూపొందించింది.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

సాంకేతికంగా డుకాటి 1299 సూపర్ లెగ్గెరా బైకులో ఫీచర్లను గమనిస్తే, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ ఎవో, డుకాటి స్లైడ్ కంట్రోల్ లతో పాటు పవర్ లాంచ్ అనే ఫీచర్‌ను డుకాటి ఇందులో అందించింది. ప్రపంచ విపణిలో పవర్ లాంచ్ కలిగిన ఏకైక మోడల్ ఇదే.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

డుకాటి 1299 సూపర్ లెగ్గెరా మొత్తం బరువు 156 కిలోలుగా ఉంది. ఇందులో 1285సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 215బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. బరువు మరియు పవర్ నిష్పత్తి పరంగా చూస్తే, ఒక టన్ను బరువు 1,430బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

ఇండియా యొక్క తొలి డుకాటి 1299 సూపర్ లెగ్గెరా

విక్రమ్ ఒబేరాయ్ మాట్లాడుతూ, "ఇండియాలో డుకాటి 1299 సూపర్ లెగ్గెరా బైకు గల ఏకైక వ్యక్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉందన్నాడు." సూపర్ బైకులంటే అమితంగా ఇష్టపడే విక్రమ్ ఒబేరాయ్ వద్ద డుకాటి 916 మరియు డుకాటి 1299 పనిగాలే ఎస్ మోటార్ సైకిళ్లతో పాటు డుకాటి వారి అత్యంత ఖరీదైన మరియు అరుదైన బైకు 1299 సూపర్ లెగ్గెరా బైకులు ఉన్నాయి.

English summary
Read In Telugu: India’s Only Ducati 1299 Superleggera Has Arrived, At A Price Of Rs 1.12 Crore
Story first published: Friday, July 7, 2017, 13:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark