మల్టీస్ట్రాడా 1200 ఎడ్యురో ప్రో ఆవిష్కరించిన డుకాటి

Written By:

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి 2017 మల్టీస్ట్రాడా ఎండ్యురో ప్రో మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. మల్టీస్ట్రాడా ఎండ్యురో శ్రేణి బైకులకు కొనసాగింపుగా దీనిని ఆవిష్కరించింది.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో

డుకాటి ఈ మల్టీస్ట్రాడా ఎండ్యురో ప్రో మోటార్ సైకిల్‌లో 1,198సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ ఇంజన్ కలదు. ఇది 152బిహెచ్‌పి పవర్ మరియు 128ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో

అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ మ్యాట్ శాండ్ పెయింట్ స్కీమ్‌తో, ట్యాంక్ కవర్ మీద టెక్ట్సర్ ఫినిషింగ్ కలదు. సబ్ ఫ్రేమ్ మరియు ఇంజన్ బ్లాక్ షేడ్ కలిగి ఉంది. ఈ ఎండ్యురో ప్రో మోటార్ సైకిల్‌లో పిరెల్లీ స్కార్పియన్ ర్యాలీ టైర్లు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో

సరికొత్త మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో లో స్కైహుక్ సస్పెన్షన్ సిస్టమ్, బెల్స్ అండ్ విజల్స్ అనే రైడింగ్ మోడ్స్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్, డుకాటి వీలీ కంట్రోల్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో

అదనంగా డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో లో తక్కువ ఎత్తులో ఉన్న విండ్ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, డుకాటి మల్టీమీడియా సిస్టమ్, మరియు బ్లూటూత్ కనెక్టివిటి వంటి ఫీచర్లు ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో

జూలై 2017 నుండి డుకాటి మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో విక్రాయల్లోకి రానుంది. ఇండియాలో ఈ మధ్యనే మల్టీస్ట్రాడా 950 విడుదలైంది. కాబట్టి ఎండ్యురో ప్రో వస్తుందో లేదో వేచి చూడాలి మరి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం, అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ జిఎస్ సిరీస్ బైకులు అగ్రస్థానంలో ఉన్నాయి, దీనికి పోటీగా రాణించేందుకు డుకాటి ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి బిఎమ్‌డబ్ల్యూ 1200జిఎస్ ర్యాలీ బైక్‌కు పోటీగా డుకాటి తమ 2017 మల్టీస్ట్రాడా 1200 ఎండ్యురో ప్రో బైకును ప్రవేశపెట్టింది.

English summary
Read In Telugu Ducati Launches Multistrada 1200 Enduro Pro
Story first published: Friday, June 23, 2017, 17:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark