స్క్రాంబ్లర్ మీద భారీ డిస్కౌంట్ ప్రకటించిన డుకాటి ఇండియా

Written By:

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ డుకాటి ఇండియా విభాగం, దేశవ్యాప్తంగా డుకాటి డీలర్ల వద్ద ఉన్న స్క్రాంబ్లర్ బైకు మీద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. డుకాటి లైనప్‌లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న బైకు స్క్రాంబ్లర్.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
డుకాటి స్క్రాంబ్లర్ మీద డిస్కౌంట్లు

డీలర్లుకు కూడా నమ్మశక్యం కాని విధంగా డుకాటి భారీ మొత్తంలో డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనికి ప్రధానం కారణం బిఎస్-III బైకులను ఏప్రిల్ 1, 2017 నుండి విక్రయించడానికి సాధ్యం కాదు. అందుకు గడువు లోపు స్టాక్ పూర్తి చేసేందుకు డుకాటి ఈ ప్రయత్నం చేస్తోంది.

డుకాటి స్క్రాంబ్లర్ మీద డిస్కౌంట్లు

డుకాటి స్క్రాంబ్లర్‌ను నాలుగు విభిన్న వేరియంట్లలో విపణిలో అందుబాటులో ఉంచింది. ప్రారంభ వేరియంట్ స్క్రాంబ్లర్ ఐకాన్ మీద తగ్గింపు ధర రూ. 1.5 లక్షలు, మరియు మిగిలిన మూడు వేరియంట్లు ఎండ్యురో, క్లాసిక్ మరియు థ్రోటిల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.

డుకాటి స్క్రాంబ్లర్ మీద డిస్కౌంట్లు

డుకాటి స్క్రాంబ్లర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.23 లక్షలు మరియు మిగిలిన మూడు వేరియంట్ల ధరలు రూ. 8.42 లక్షలతో ప్రారంభం కానున్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ముంబాయ్‌గా ఉన్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ మీద డిస్కౌంట్లు

బిఎస్-III ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలిగిన ఉన్న వేరియంట్ల మీద మాత్రమే ఈ ఆఫర్లు లభిస్తున్నాయి. ఏప్రిల్ 1, 2017 నుండి దేశీయంగా బిఎస్-III టూ వీలర్ల విక్రయాలు మరియు రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్టు నిషేధించింది.

డుకాటి స్క్రాంబ్లర్ మీద డిస్కౌంట్లు

డుకాటి స్క్రాంబ్లర్ లైనప్‌లోని అన్ని వేరియంట్లలో 803సీసీ సామర్థ్యం గల ఎల్-ట్విన్, గాలితో చల్లబడే ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 75బిహెచ్‌పి పవర్ మరియు 68ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

 
English summary
Ducati Offering Huge Discounts On Scrambler In India
Story first published: Thursday, March 30, 2017, 16:11 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark