డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల: ధర రూ. 9.32 లక్షలు

Written By:

డుకాటి ఇండియన్ మార్కెట్లోకి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ మోటార్ సైకిల్‌ను విడుచదల చేసింది. డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 9,32,000 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ బైకులో 803సీసీ సామర్థ్యం గల గాలి మరియు ఆయిల్‌తో చల్లబడే ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 72బిహెచ్‌పి పవర్ మరియు 5,750ఆర్‌పిఎమ్ వద్ద 67ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

2017 స్క్రాంబ్లర్ కేఫె రేసర్ మోటార్ సైకిల్‌ను ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద నిర్మించారు. దీనికి ముందు వైపున 41ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ కయాబా ఫ్రంట్ ఫోర్క్ కలదు మరియు వెనుక వైపున పూర్తి స్థాయిలో అడ్జెస్ట్ చేసుకునే కయాబా మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున 4-పిస్టన్ మోనోబ్లాక్ బ్రెంబో ఎమ్4-32 కాలిపర్ లను రేడియల్‌గా మౌంట్ చేసిన 330ఎమ్ఎమ్ సెమీ ఫ్లోటింగ్ డిస్క్ బ్రేక్ ఉంది, రియర్ వీల్ మీద 245ఎమ్ఎమ్ చుట్టు కొలత డిస్క్ బ్రేక్ సింగల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌ను కలిగి ఉంది. రెండు బ్రేకుల్లో కూడా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ బైకులో 10-స్పోక్ 17-అంగుళ్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటిలో ముందు చక్రానికి 120/70 జడ్ఆర్17 మరియు వెనుక చక్రానికి 180/55 జడ్ఆర్ 17 కొలతల్లో ఉన్న పిరెల్లీ డియాబ్లో రోస్సో II టైర్లు ఉన్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

డుకాటి స్క్రాంబ్ల్ సిరీస్ మోటార్ సైకిళ్ల డిజైన్ ఫిలాసఫీ మరియు స్పోర్టివ్ రైడింగ్ పొజిషన్ కల్పిస్తూ, స్క్రాంబ్లర్ కేఫె రేసర్ మోటార్ సైకిల్‌ను డిజైన్ చేసారు. ఇందులో హ్యాండిల్ బార్ మీద రియర్ వ్యూవ్ మిర్రర్ అల్యూమినియం క్లిప్స్, రెండు ఎగ్జాస్ట్ పైపులు, బ్లాక్ పూత పూయబడిన అల్యూమినియం కవర్ మరియు కేఫె రేసర్ సీట్ కవర్ ఇందులో ఉన్నాయి.

డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ విడుదల

డుకాటి తమ సరికొత్త స్క్రాంబ్లర్ కేఫె రేసర్ మోటార్ సైకిల్‌ను బ్లాక్ కాఫీ కలర్, బ్లాక్ ఫ్రేమ్ మరియు గోల్డ్ వీల్స్ తో అందిస్తోంది. డుకాటి స్క్రాంబ్లర్ కేఫె రేసర్ ప్రస్తుతం విపణిలో ఉన్న ట్రయంప్ బొన్‌విల్లే టి100 కు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: Ducati Scrambler Cafe Racer Launched In India; Priced At Rs 9.32 Lakhs
Story first published: Thursday, August 3, 2017, 17:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark