డుకాటి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైక్ విడుదల: ధర, ఇంజన్, స్పెసిఫికేషన్స్ మరియు ఫోటోలు
డుకాటి ఇండియా విభాగం మార్కెట్లోకి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైకును లాంచ్ చేసింది. సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైక్ ధర రూ. 8.52 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
డుకాటి ఇండియా విభాగం మార్కెట్లోకి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైకును లాంచ్ చేసింది. సరికొత్త డుకాటి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైక్ ధర రూ. 8.52 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

డుకాటి ఈ స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 మోటార్ సైకిల్‌లో కాలిఫోర్నియా డిజైనర్ రోలాండ్ శాండ్స్ సెలబ్రేషన్స్‌కు ప్రతీకగా 1970ల కాలం నాటి వెస్ట్ కోస్ట్ స్టైల్ కలర్ థీమ్‌లో సరికొత్త బాడీ పెయింట్ స్కీమ్ పరిచయం చేయడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఢిల్లీ, ముంబాయ్, బెంగళూరు, పూనే, అహ్మదాబాద్, కలకత్తా మరియు కొచ్చి నగరాలలో ఉన్న ఏడు డుకాటి విక్రయ కేంద్రాలలో మాత్రమే ఈ సరికొత్త స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైక్ లభిస్తోంది.

డుకాటి ఇండియా విపణిలోకి స్క్రాంబ్లర్ పేరుతో పలురకాల మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. అవి ఐకాన్, క్లాసిక్ మరియు ఫుల్ థ్రోటిల్. మ్యాక్ 2.0 బైకులో ఎత్తైన హ్యాండిల్ బార్, ఫ్లాట్ ట్రాక్ ప్రో సీట్, బ్లాక్ ఎగ్జాస్ట్ పైప్ మరియు సిలిండర్ హెడ్ కవర్లు అదే విధంగా కెఫే రేసర్ బాడీ స్టైల్‌ను ఇందులో ఇముడింపజేశారు.

లేటెస్ట్ స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 పేరును చరిత్రలో 1965లో డుకాటి మ్యాక్ 1 పేరుతో 250సీసీ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆ రోజుల్లోనే ఇందులో ఉన్న ఇంజన్ అత్యుత్తమ పవర్ ప్రొడ్యూస్ చేసేది. డుకాటి స్క్రాంబ్లర్ 250 మ్యాక్ 1 ఆధారంగా ఈ మ్యాక్ 2.0 పేరు వచ్చింది.

మ్యాక్ అనే పేరును డుకాటి పరిచయం చేయడానికి కూడా మరో కారణం ఉంది. మ్యాక్ అనేది వేగానికి చెందిన పదం. అంతే కాకుండా సూపర్ సోనిక్ వేగాన్ని మ్యాక్ యూనిట్లలో కొలుస్తారు. అందుకే ఈ మ్యాక్ 1, మ్యాక్ 2.0 పేర్లను డుకాటి ఎంచుకుంది.

సాంకేతికంగా డుకాటి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైకులో 803సీసీ కెపాసిటి గల వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 72.4బిహెచ్‌పి పవర్ మరియు 5,750ఆర్‌పిఎమ్ వద్ద 67ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డుకాటి స్క్రాంబ్లర్ మ్యాక్ 2.0 బైకు ఇండియన్ మార్కెట్లో ట్రయంప్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ మరియు యమహా ఎఫ్‌జడ్-07 బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డుకాటి ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల స్క్రాంబ్లర్ శ్రేణి మోటార్ సైకిళ్లను అందుబాటులో ఉంచింది. అయితే, తమ చరిత్రను రంగరించి అత్యంత అరుదైన మోడల్‌గా, విభిన్న డిజైన్ శైలిలో అరుదైన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది. కాబట్టి డుకాటి స్క్రాంబ్లర్ ప్రేమికులు మ్యాక్ 2.0 ఒక హిస్టారికల్ వెర్షన్ స్క్రాంబ్లర్ అనే రీజన్‌తో ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








