2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్ విడుదల వివరాలు

2018 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ మరియు 2018 హోండా గోల్డ్‌వింగ్ విడుదల వివరాలు

By Anil

డ్రైవ్‌స్పార్క్ ప్రత్యేక కథనం: జపాన్‌కు చెందిన అగ్రగామి టూ వీలర్ల తయారీ సంస్థ సుజుకి 2018 సిబిఆర్ 1000ఆర్ఆర్ మరియు 2018 గోల్డ్‌‌వింగ్ మోటార్ సైకిళ్లను ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ విపణిలోకి విడుదల చేసి, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి దేశీయంగా విడుదల చేయనున్నట్లు డ్రైవ్‌స్పార్క్‌కు సమాచారం అందింది. ప్రపంచ విపణిలో సిబిర్ పర్ఫామెన్స్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌‌గా ఉంది మరియు గోల్డ్‌వింగ్ ప్రీమియర్ ఆఫ్ అల్ట్రా లగ్జరీ క్రూయిజర్ మోటార్‌ సైకిల్‌గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌తో మాట్లాడిన హోండా ప్రతినిధి సమాచారం మేరకు, 2018 మోడల్ హై ఎండ్ మోటార్ సైకిళ్లను 2017 నవంబర్ నాటికి ప్రపంచ మార్కెట్లోకి, 2018 జనవరి నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే 2018 మోడల్స్‌లో రానున్న మార్పులు గురించి ఎలాంటి విషయం స్పష్టం చేయలేదు.

Recommended Video

2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

హోండా గోల్డ్‌వింగ్

ఇలాంటి శ్రేణి మోటార్ సైకిళ్లు ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సుజుకి గోల్డ్‌వింగ్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌కు హ్యార్లీ డేవిడ్‌సన్ సివిఒ లిమిటెడ్ మరియు ఇండియన్ రోడ్‌మాస్టర్ బైకులు పోటీగా ఉన్నాయి. మూడింటిలో సుజుకి గోల్డ్‌వింగ్ అన్ని అంశాల పరంగా ముందు స్థానంలోనే ఉంది.

సాంకేతికంగా హోండా గోల్డ్‌వింగ్ మోటార్ సైకిల్‌లో 117బిహెచ్‌పి పవర్ మరియు 167ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1832సీసీ సామర్థ్యం గల ఫ్లాట్ ఆరు సిలిండర్ల ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ షాప్ట్ డ్రైవ్‌ సిస్టమ్‌తో రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది. 362కిలోల బరువు ఉన్న ఈ క్రూయిజర్ బైకులో ఎలక్ట్రిక్ రివర్స్ సిస్టమ్ కలదు.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

సుజుకి గోల్డ్‌వింగ్ బైకులో ఇప్పటికే అడ్వాన్స్‌డ్ పవర్ ట్రైన్ కలదు, కాబట్టి ఇంజన్, ట్రాన్స్‌మిషన్ పరంగా ఎలాంటి అప్‌డేట్స్ అవసరం లేదు. అయితే 2018 మోడల్‌లో అప్‌గ్రేడెడ్ ఇంజన్ అందివ్వడంతో పవర్ మరియు టార్క్ 2 శాతం వరకు పెరగనుంది. మునుపటి మోడల్‌లో లభించే దాదాపు అన్ని ఫీచర్లను యథావిధిగా రానున్నాయి.

2018 మోడల్ సుజుకి గోల్డ్‌వింగ్‌లో ప్రధానంగా గుర్తించదగిన మార్పు డిజైన్. అన్ని యాంగిల్స్‌లో గోల్డ్‌వింగ్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారీ పరిమాణానికి స్వస్తి పలుకుతూ, స్పోర్టివ్ మరియు ఫ్రెష్ లుక్‌లో రీ డిజైన్ చేయనున్నారు.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ముందు వైపున నాలుగు అంగుళాల వరికు కదిలే మరియు ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే సెట్టింగ్స్ ఉన్న పెద్ద విండ్ స్క్రీన్ కలదు. హ్యాండిల్ బార్‌ హీటింగ్ ఫీచర్, అదే విధంగా ఫ్రంట్ మరియు రియర్ సీట్ హీటింగ్ ఫీచర్‌తో పాటు, న్యావిగేషన్ ఫీచర్‌ను యథావిధిగా అందివ్వడం జరిగింది.

హోండా అప్ కమింగ్ గోల్డ్‌వింగ్ మోటార్ సైకిల్‌లో సరౌండింగ్ మ్యూజిక్ ప్రధాన మార్పుగా పరిగణించవచ్చు. రైడింగ్ పొజిషన్ ముందు వైపుకు వాలును కల్పించే విధంగా గోల్డ్‌వింగ్‌లోని అల్యూమినియం ఛాసిస్ మార్పులు జరిగాయి.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త, ఈ సెగ్మెంట్లో మొట్టమొదటి సారిగా లింక్ సస్పెన్షన్ సిస్టమ్ అందివ్వనుంది. తాత్కలికంగా అందిన సమాచారం మేరకు ఈ మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. అయితే రహస్యంగా లీక్ అయిన గోల్డ్‌వింగ్ మోటార్ సైకిల్ చిత్రాల ద్వారా మార్పులు నిజమే అని స్పష్టమవుతోంది.

హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్

హోండా లైనప్‌లో అత్యుత్తమ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్. శక్తివంతమైన ఈ మోటార్ సైకిల్‍‌కు ప్రపంచ విపణిలో గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే 2018 మోడల్‌తో సిబిఆర్1000ఆర్ఆర్ మోటర్ సైకిల్‌లో మార్పులు తెచ్చి పోటీదారులను ఎదుర్కొనే ప్రయత్నం చేయనుంది.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ప్రస్తుతం శ్రేణిలో హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ గుడ్ లుకింగ్ మోటార్ సైకిల్. అయితే దీనికి పోటీగా ఉన్న యమహా వైజడ్ఎఫ్ ఆర్1 ఎమ్ మరియు కవాసకి జడ్ఎక్స్ 10ఆర్ మోటార్ సైకిళ్లతో పోల్చితే అంత బాగుండదు. కాబట్టి డిజైన్ పరంగా 2018 సిబిఆర్ 1000ఆర్ఆర్ మోటార్ సైకిల్‌లో మార్పులు జరిగి అవకాశం ఉంది. పూర్తిగా స్థాయి డిజైన్‌లో మార్పులు జరగకపోయినప్పటికీ స్వల్పంగా మార్పులు జరిగనున్నాయి.

రియర్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు, అయితే ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త ట్విన్ హెడ్ ల్యాంప్ క్లస్టర్‌కు పేటెంట్ హక్కులు పొందినట్లు తెలిసింది.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

పర్ఫామెన్స్ మోటార్ సైకిళ్లలో అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ప్రధానమైన అంశం. ఈ తరహా బైకులు గరిష్టంగా 200బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేస్తాయి. 200 కన్నా ఎక్కువ పవర్ ఉత్పత్తి చేసే మోడళ్లు విపణిలో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఇంజన్‌లో మార్పులు చేసి, అధిక పవర్ అందించే విధంగా ట్యూనింగ్ చేయనున్నారు.

అప్ కమింగ్ 2018 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే 5బిహెచ్‌పి పవర్ వరకు అధికంగా ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. 5బిహెచ్‌పి పవర్ పెద్ద సంగతేం కాదు అనే వారు లేకపోలేదు. అయితే, బరువు, స్టెబిలి మరియు ఇందులో వివియోగించే ఎలక్ట్రానిక్స్‌కు అనుగుణంగా ఇంజన్ పవర్ స్వల్ప మేరకు పెరిగితే పర్ఫామెన్స్‌‌లో పెద్ద మార్పులు కనిపిస్తాయి.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ఇంజన్‌కు అధిక మొత్తంలో గాలి చేరేందుకు ముందు వైపున రీ డిజైన్ చేయబడిన ఎయిర్ బాక్స్ మరియు ఎయిర్ ఇంటేక్ వ్యవస్థను రివైజ్ చేయబడిన ప్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో అందివ్వనుంది. దీంతో మరింత హార్స్‌పవర్ సాధ్యమవుతుంది. మునుపున్న బాష్ 9.1 ఎమ్‌పి ఏబిఎస్ స్థానంలో కంబైన్-యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(C-ABS)ను భర్తీ చేయనుంది. తద్వారా 6.5 కిలోలు వరకు బరువు తగ్గుతుంది.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

2018 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ మోటార్ సైకిల్ బాష్ సంస్థ విడిపరికరాలు ప్రధాన పాత్ర పోషించున్నాయి. ప్రత్యేకించి అన్ని ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఇనర్షియల్ మూమెంటమ్ యూనిట్(IMU) ఒకటి. IMU వ్యవస్థ ఆరు తలాల పరంగా మోటార్ సైకిల్ కదికలకు సంభందించిన డేటాను నిక్షిప్తం చేసుకుంటుంది.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ఐఎమ్‌యు ద్వారా ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటి వీలి ప్రోగ్రాం మరియు ఓహ్లిన్స్ సెమి ఆక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్స్ ద్వారా వెహికల్‌ను కంట్రోల్‌లో అయినా ఉంచుతుంది, లేదంటే మూమెంటమ్ ఆధారంగా వెహికల్ వేగాన్ని పెంచడానికైనా ఉపయోగపడుతుంది.

2018 హోండా CBR1000RR మరియు గోల్డ్‌వింగ్

ఓహ్లిన్ సిస్టమ్ విషయానికి వస్తే, 2018 హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ ఫైర్‌బ్లేడ్ టాప్ మోడల్ సెమి-ఆక్టివ్ సస్పెన్షన్‌తో రానుంది. లేటెస్ట్ వెర్షన్ స్మార్ట్ ఇసి సెమి-ఆక్టివ్ సస్పెన్షన్ సిస్టమ్ తొలుత డుకాటి 1299 పనిగాలే ఎస్‌లో పరిచయం చేయబడింది.

హోండా 2018 లో ప్రవేశపెట్టనున్న ఈ రెండు మోడళ్ల ధరలు అధికంగానే ఉండున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా లైనప్‌లో సిబిఆర్1000ఆర్ఆర్ మరియు గోల్డ్‌వింగ్ మోటార్ సైకిళ్లు ఇకానిక్ బైకులుగా ఉన్నాయి. ఈ రెండు మోడళ్ల ద్వారా ప్రపంచ విపణిలో హోండా ఇప్పటికే మంచి సక్సెస్ అందుకుంది. అయితే 2018 ఎడిషన్‌లో రానుండటంతో భారీ సక్సెస్ దిశగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
Read In Telugu: 2018 Honda CBR 1000RR and 2018 Honda Goldwing Launch Dates Revealed
Story first published: Monday, July 31, 2017, 19:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X