మరో రెండు నెలల్లో ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

Written By:

ఇంటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఎఫ్‌బి మోండ్యాల్(FB Mondial) ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. తాజాగా అందుతున్న సమచారం మేరకు, ఎఫ్‌బి మోండ్యాల్ మరో రెండు మూడు నెలల్లో దేశీయంగా తమ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దం చేయనున్నట్లు తెలిసింది.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

గతంలో, ఎఫ్‌బి మోండ్యాల్ హెచ్‌పిఎస్ 125 బైకును పూనేలోని ఆర్ఐఆ కార్యాలయం వద్ద పరీక్షిస్తూ మీడియా కంటికి చిక్కింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్లేటుతో ఎఫ్‌బి మోండ్యాల్ బృందం దీనిని ఇండియాలో పరీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. అయితే దేశీయంగా వీటి ఉత్పత్తి మరియు మరే ఇతరతో సంస్థతో జట్టు కట్టే విషయం గురించి ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

ఎఫ్‌బి మోండ్యాల్ సంస్థ 1929 లో ఇటలీలోని మిలాన్‌లో స్థాపించబడింది. 1949 నుండి 1957 మధ్య జరిగిన ప్రపంచ మోటార్ సైకిల్ ఛాపియన్‌షిప్‌లలో ఎఫ్‌బి మోండ్యాల్ ఆధిపత్యం చెలాయించింది. కొన్ని అత్యాధునిక మరియు విజయవంతమైన జిపి రేసర్లను కూడా తయారుచేసింది. ఈ క్రమంలో ఐదు రైడర్లకు మరియు తయారీదారుడు టైటిళ్లను సొంతం చేసుకుంది.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

125సీసీ మరియు 250సీసీ మోటార్ సైకిళ్ల విభాగంలో ప్రపంచ టైటిళ్లను గెలుపొందిన ఎఫ్‌బి మోండ్యాల్ రేస్ మోటార్ సైకిళ్లను హోండా సంస్థ వ్యవస్థాపకుపడు సోయిచిరో హోండా 1957లో కొనుగోలు చేశాడు. ఆ తరువాత కాలంలో వీటిని ఉపయోగించి రేసింగ్ బైకులను హోండా అభివృద్ది చేసింది. ఒరిజినల్ మోండ్యాల్ 125 బైకు హోండా వారి మోటేగీ కలెక్షన్ హాలు‌లో ఇప్పటికీ ప్రదర్శనలో ఉంది.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

అయితే, ఉత్పత్తి వ్యయం పెరగడం మరియు ఆశించిన సేల్స్ లభించకపోవడంతో 1957 గ్రాండ్ ప్రిక్స్ చివర్లో రేసింగ్ నుండి మోండ్యాల్ సంస్థ వైదొలగింది. అయినప్పటికీ, ఇతర సంస్థల నుండి ఇంజన్‌లను సేకరించి మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసేది. కానీ, 1979 లో శాశ్వతంగా ప్రొడక్షన్‌ను నిలిపివేసింది.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

2014లో ఎఫ్‌బి మోండ్యాల్ అధిపతి మరియు పెల్పి ఇంటర్నేషనల్ ఇటలీ హోల్డర్ సిసారే గాల్లీ ఇద్దరూ కలిసి సంస్థను పునఃప్రారంభించాలని భావించారు. 2015 లో నూతన ఉత్పత్తుల స్కెచ్‌లు, ప్రోటోటైప్‌ దశలోకి వచ్చి, చివరికి ప్రొడక్షన్ వెర్షన్ హెచ్‌పిఎస్ 125 మరియు హెచ్‌పిఎస్ 250 బైకులు ప్రాణం పోసుకున్నాయి.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

ఈ బైకులను చైనా విపణిలో పియాజియో సంస్థ ఉత్పత్తి చేస్తోంది. క్లాసిక్ మోండ్యాల్ క్యారెక్టర్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హెచ్‌పిఎస్ బైకులను నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ఎఫ్‌బి మోండ్యాల్ బైకుల్లో పియాజియో ఇంజన్‌లు శక్తినందిస్తున్నాయి.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

ప్రస్తుతం ఎఫ్‌బి మోండ్యాల్ నాలుగు విభిన్న మోటార్ సైకిళ్లను ఆఫర్ చేస్తోంది. అవి, హెచ్‌పిఎస్ 125, కేఫె రేసర్ థీమ్‌లో హెచ్‌పిఎస్ 250 మరియు ఆఫ్ రోడర్ శైలిలో ఎస్‌ఎమ్‌టి మరియు ఎస్ఎమ్ఎక్స్ ఉన్నాయి.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

ఎఫ్‌బి మోండ్యాల్ తాజాగా ఇండియన్ మార్కెట్లో పరీక్షిస్తూ పట్టుబడిన బైకు హెచ్‌పిఎస్ 125. ఇందులో 125సీసీ కెపాసిటి ఉన్న లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 13.2బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

ఎఫ్‌బి మోండ్యాల్ హెచ్‌పిఎస్ 125 మోటార్ సైకిల్‌లో ముందువైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. డ్యూయల్ పర్పస్ టైర్లు గల స్పోక్ వీల్స్ ఉన్నాయి. స్క్రాంబ్లర్ స్టైల్లో ఉన్న ఫ్లాట్‌ హ్యాండిల్ బార్ మరియు ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

ఎఫ్‌బి మోండ్యాల్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎఫ్‌బి మోండ్యాల్ 2014లో తిరిగి ప్రాణం పోసుకున్న ఇంటాలియన్‌కు చెందిన ఓ లెజండరీ మోటార్ సైకిళ్ల సంస్థ. హెచ్‌పిఎస్ 125 కేఫే-రేసర్ స్టైల్ మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. అయితే కార్యకలాపాల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

English summary
Read In Telugu: FB Mondial To Commence Distribution In India
Story first published: Monday, September 4, 2017, 10:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark