బిఎస్-IV ఇంజన్‌తో హీరో గ్లామర్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఇతర వివరాలు

Written By:

దేశీయ దిగ్గజ కమ్యూటర్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ గ్లామర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ వేరియంట్‌లో బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ల జోడింపుతో మార్కెట్లోకి 2017 గ్లామర్‌గా విడదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల
  • 2017 గ్లామర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 57,775 లు
  • 2017 గ్లామర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 59,755 లు
  • ఎఫ్ఐ వేరియంట్ బైకు ధర రూ. 66,580 లు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.
బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

ఫ్యూయల్ ఇంజెక్టడ్ పరిజ్ఞానం ఉన్న గ్లామర్ మోటార్ సైకిల్ కేవలం డిస్క్ బ్రేకు వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ విక్రయ కేంద్రాలలో ఈ ఎఫ్ఐ వేరియంట్‌ గ్లామర్‌ను బుక్ చేసుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో డెలివరీలు కూడా ప్రారంభించనున్నారు.

బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

సాంకేతికంగా 2017 హీరో గ్లామర్ ఎఫ్ఐ వేరియంట్లో 125సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 11.5బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

మునుపటి వేరియంట్‌తో పోల్చితే సమాతరంగా ఉండే ఇంజన్‌ను స్వల్పంగా మార్చి కోణీయంగా అమర్చిన తీరును గమనించవచ్చు. సరికొత్త గ్లామర్ వేరియంట్లు నూతన కార్బోరేటర్లు మరియు అధునాతన ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

డిజైన్ పరంగా మునుపటి గ్లామర్‌తో పోల్చుకుంటే సరికత్త 2017 గ్లామర్ కండలు తిరిగిన ఆకారాన్ని కలిగి ఉంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ డిజిటల్ మరియు అనలాగ్ సమ్మేళిత ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

బిఎస్-IV హీరో గ్లామర్ విడుదల

ప్రస్తుతం విపణిలో ఉన్న హోండా సిబి షైన్, టీవీఎస్ ఫీనిక్స్ మరియు యమహా సెల్యూటో వంటి వాటికి ఇది గట్టిపోటీనివ్వనుంది.

English summary
Read In Telugu To know about 2017 Hero Glamour FI launch details. Get more details about 2017 Hero Glamour FI engine, mileage, Features, Specifications and more details.
Story first published: Saturday, April 15, 2017, 17:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark