ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు

Written By:

హీరో మోటోకార్ప్ అభివృద్ది చేసిన ఐ3ఎస్ టెక్నాలజీ మంచి విప్లవాన్ని సాధించింది. ఈ సాంకేతికత ద్వారా మైలేజ్ గణనీయంగా పెరగడంతో తమ అన్ని ఉత్పత్తుల్లో ఐ3ఎస్ టెక్నాలజీ అందిస్తోంది హీరో. అందులో భాగంగా తమ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైకులో ఈ టెక్నాలజీని పరిచయం చేసింది.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఐ3ఎస్ పరిజ్ఞానంతో విడుదలైన బైకు ధర రూ. 46,630 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఐ3ఎస్ టెక్నాలజీ ద్వారా మైలేజ్ పెరుగుతుండటంతో ఈ కమ్యూటర్ బైకులో దీనిని పరిచయం చేశారు.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఉన్న అన్ని వేరియంట్లలో కూడా ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్ ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ఈ హెచ్ఎఫ్ డీలక్స్ విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి,

  • కిక్-స్టార్ట్,
  • స్పోక్ వీల్స్, మరియు
  • సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్ వీల్స్.
ఐ3ఎస్ పనితీరు

ఐ3ఎస్ పనితీరు

బైకు ఆన్ లో ఉండి న్యూట్రల్ గేర్‌పొజిషన్ ఉన్నపుడు బైకు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఒక వేళ మళ్లీ స్టార్ట్ చేయాలనుకున్నపుడు క్లచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆన్ అవుతుంది.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

ట్రాఫిక్‌లో సిగ్నల్స్ వద్ద వెయిట్ చేస్తున్నపుడు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరియు అలా ఇంజన్ ఐడిల్‌గా ఉంచినపుడు వేస్ట్ అయ్యే ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఐ3ఎస్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి,

  • బ్లాక్-బ్లూ,
  • బ్లాక్-రెడ్, మరియు
  • బ్లాక్ పర్పుల్.
ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

ఐ3ఎస్ మోడల్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌కు సంభందించిన మైలేజ్ వివరాలను హీరో వెల్లడించలేదు. అయితే రెగ్యులర్ మోడల్ హెచ్‌ఎఫ్ డీలక్స్ మైలేజ్ లీటర్‌కు 88.5కిలోమీటర్లుగా ఉంది.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

మెకానికల్‌గా ఈ హెచ్ఎఫ్ డీలక్స్ ఐ3ఎస్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌లో 97.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా ఇది 8.24బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఐ3ఎస్ టెక్నాలజీతో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ విడుదల

హెచ్ఎఫ్ డీలక్స్ ఐ3ఎస్ బైకులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలదు మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ కూడా అందివ్వడం జరిగింది.

English summary
Read In Telugu Hero HF Deluxe i3S Launched In India; Priced At Rs 46,630
Story first published: Friday, May 19, 2017, 17:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more