HX250R విషయంలో వెనక్కి తగ్గిన హీరో: ఇదీ అసలు సంగతి!

దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2014 సంవత్సరంలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హెచ్ఎక్స్250ఆర్ అనే సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

By Anil

హీరో మోటోకార్ప్ అంటే పూర్తి స్థాయి ఇండియన్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మనందరికీ తెలిసిందే. దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్ 2014 సంవత్సరంలో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హెచ్ఎక్స్250ఆర్ అనే సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

హీరో హెచ్ఎక్స్250ఆర్

అయితే, ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ గురించి ఓ ఆధారం లేని వార్త నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది. హీరో మోటోకార్ప్ అభివృద్ది చేసిన ఈ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్ కోసం కాదంట, మన మార్కెట్లో దీని విడుదల అస్సలు ఉండదనే ప్రచారం జోరుగా సాగుతోంది.

హీరో హెచ్ఎక్స్250ఆర్

హీరో మోటోకార్ప్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించిన హెచ్ఎక్స్250ఆర్ బైకును సరిగ్గా రెండేళ్ల తరువాత ప్రొడక్షన్ మోడల్ వెర్షన్‌లో ఆర్ అనే అక్షరాన్ని తొలగించి హెచ్ఎక్స్250 పేరుతో బ్లూ కలర్‌లో ప్రదర్శించింది.

Recommended Video

Hero MotoCorp’s 250cc Supersport Will Not Be Launched In India - DriveSpark
హీరో హెచ్ఎక్స్250ఆర్

అయితే, ఈ హెచ్ఎక్స్250 మోటార్ సైకిల్‌ను విడుదల చేసే ఆలోచన మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. బహుశా హీరో దీని విడుదలకు శాశ్వతంగా బ్రేక్ వేసినట్లుంది. నిజమే, హీరో మోటోకార్ప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్కస్ బ్రాన్స్‌పర్గర్ దిగ్గజ మీడియాతో మాట్లాడుతూ ఆ విషయాన్ని వెల్లడించాడు.

హీరో హెచ్ఎక్స్250ఆర్

బ్రాన్స్‍‌పర్గర్ మాట్లాడుతూ, " ఇండియన్ మోటార్ సైకిల్ పరిశ్రమలో 250సీసీ కెపాసిటి గల బైకులకు అంత డిమాండ్ లభించడం లేదు, ఇప్పుడు 300సీసీ, అంత కన్నా ఎక్కువ కెపాసిటి గల మోడళ్లకే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు." కాబట్టి, ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి 250సీసీ టూ వీలర్లకు బదులు 300సీసీ కెపాసిటి గల మోడళ్ల మీద దృష్టిసారించాల్సిన అవసరం ఉందని హీరో తెలుసుకుంది.

హీరో హెచ్ఎక్స్250ఆర్

బ్రాన్స్‌పర్గర్ తమ ఫ్యూచర్ మోడళ్ల గురించి ప్రస్తావిస్తూ, కంపెనీ హెచ్ఎక్స్250ఆర్ కంటే, అడ్వాన్స్‌డ్ మరియు బెటర్ మోటార్ సైకిళ్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపాడు. పూర్తి స్థాయి నూతన టెక్నాలజీతో భవిష్యత్ మోటార్ సైకిళ్లను డెవలప్ చేయనుంది.

Trending On DriveSpar Telugu:

హీరో హెచ్ఎక్స్250ఆర్

కాన్సెప్ట్ రూపంలో ఉన్న హెచ్ఎక్స్250ఆర్ శరీరం నిండా భారీ డీకాల్స్‌తో కంప్లీట్ స్పోర్ట్స్ బైకును తలపిస్తుంది. ఫ్రంట్ డిజైన్‌లో ట్విన్-ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టెప్-అప్ స్ల్పిట్ సీట్ కలవు.

హీరో హెచ్ఎక్స్250ఆర్

సాంకేతికంగా హీరో హెచ్ఎక్స్250ఆర్ మోటార్ సైకిల్‌లో అందించిన 249సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ 31బిహెచ్‌పి పవర్ మరియు 26ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హీరో హెచ్ఎక్స్250ఆర్

హీరో ప్రకారం, హెచ్ఎక్స్250ఆర్ బైక్ కేవలం 2.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక మోనోషాక్ అబ్జార్వర్ అందివ్వడం జరిగింది. అంతే కాకుండా సిటి మరియు స్పోర్ట్ అనే రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లను ఫస్ట్ క్లాస్ ఫీచర్‌గా పరిచయం చేసింది.

హీరో హెచ్ఎక్స్250ఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో బాగా రాణిస్తున్నప్పటికీ ఎక్కువ కెపాసిటి గల సెగ్మెంట్లో హీరో సక్సెస్ అందుకోలేకపోతోంది. 200సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల విభాగంలో ఇతర మోడళ్లకు గట్టి పోటీనిచ్చే లక్ష్యంతో హెచ్ఎక్స్250ఆర్ ను అభివృద్ది చేసినప్పటికీ, ఇప్పుడు ఈ సెగ్మెంట్ మోడళ్లకు ఆదరణ కరువైపోవడం మరియు డిజైన్ అవుట్‌డేట్‌ కావడంతో లాంచ్ చేసినా ఫెయిల్యూర్ తప్పదనే ఉద్దేశ్యంతో హెచ్ఎక్స్250ఆర్ విడుదలను నిలిపివేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, హెచ్ఎక్స్250ఆర్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగల్చిందని చెప్పవచ్చు.

అయితే, హీరో మోటోకార్ప్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మోటార్ సైకిల్‌ను లాంచ్ చేయడానికి సుముఖంగా ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2017, 13:18 [IST]
English summary
Read In Telugu: Hero MotoCorp’s 250cc Supersport Will Not Be Launched In India; Here’s Why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+