హోండాకు పోటీగా మూడు కొత్త స్కూటర్లను విడుదల చేయనున్న హీరో

హీరో మోటోకార్ప్ ఇండియన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కొత్త స్కూటర్లను ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతోంది.

By Anil

హీరో ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లో మూడు కొత్త స్కూటర్లను విడుదల చేయనుంది. దేశీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇండియన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు కొత్త స్కూటర్లను ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతోంది.

హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

హీరో మోటోకార్ప్ తొలుత 125సీసీ సామర్థ్యం గల సరికొత్త స్కూటర్‌ను ఈ ఏడాది నాలుగవ ఆర్థిక త్రైమాసికంలో విపణిలోకి విడుదల చేసే ప్రణాళికల్లో ఉంది. మరియు ప్రస్తుతం హోండా శాసిస్తున్న స్కూటర్ల సెగ్మెంట్లోకి 2018-2019 మధ్య కాలంలో మరో రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది.

Recommended Video

Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

దీంతో పాటు, హీరో మోటోకార్ప్ ప్రీమియమ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇందులో 200సీసీ సామర్థ్యం ఉన్న ఎక్స్‌స్ట్రీమ్ 200ఎస్ ను సిద్దం చేసే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి పవన్ ముంజాల్ మాట్లాడుతూ, టూ వీలర్లలోని అన్ని సెగ్మెంట్లలో దాదాపు అర డజను నూతన ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు తెలిపాడు, వీటిలో స్కూటర్లు మరియు ప్రీమియమ్ మోటార్ సైకిళ్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ 2018 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు."

హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

హీరో మోటోకార్ప్ ఇండియాలో మూడు స్కూటర్లను విక్రయిస్తోంది. అవి - మాయెస్ట్రో ఎడ్జ్(110సీసీ), డ్యూయెట్(110సీసీ) మరియు ప్లెజర్(100సీసీ). హీరో మూడు కొత్త స్కూటర్లను తమ లైనప్‌లోకి విడుదల చేసి మరింత శక్తివంతంగా మారనుంది.

హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

హీరో మోటోకార్ప్‌కు అధిక పోటీనిస్తున్న హోండా ఇండియాలో ఐదు స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఈ జపాన్ దిగ్గజం ఇండియన్ స్కూటర్ల విభాగంలో 60 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుని స్కూటర్ల విక్రయాల్లో ఆధిక్యంలో ఉంది. దీని తర్వాత 15 శాతం మార్కెట్ వాటాతో టీవీఎస్ మరియు 12 శాతం మార్కెట్ వాటాతో హీరో మోటోకార్ప్ రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి.

హీరో మోటోకార్ప్ నుండి మూడు కొత్త స్కూటర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హీరో మోటోకార్ప్ మాజీ భాగస్వామి హోండా టూ వీలర్స్ ఇప్పుడు ఇండియన్ స్కూటర్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉంది. జపాన్ దిగ్గజాన్ని వెనక్కి నెట్టడంలో భాగంగా హీరో వ్యూహాత్మక ప్రణాళికలు రచించినట్లు స్పష్టమవుతోంది. మూడు కొత్త స్కూటర్లను విడుదల చేయనున్నట్లు హీరో తెలపడం అందుకు నిదర్శనం.

Most Read Articles

English summary
Read In Telugu: Hero MotoCorp To Launch Three Scooters To Rival Honda
Story first published: Monday, August 14, 2017, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X