కరిజ్మా బైకును మళ్లీ విడుదలకు సిద్దం చేస్తున్న హీరో
దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ పర్ఫామెన్స్ బైకుల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించిన హీరో కరిజ్మా బైకును రీలాంచ్ చేయడానికి సిద్దమైంది.
హీరో కరిజ్మాకు దేశవ్యాప్తంగా విపరీతంగా అభిమానులు ఉన్నారు. విదేశీ బైకుల మోజులో పడి కరిజ్మా బైక్‌కు ఆశించిన స్పందన లభించకపోవడంతో మార్కెట్ నుండి శాశ్వతంగా వైదొలగింది.

అయితే, వచ్చే ఏడాది నుండి దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ పర్ఫామెన్స్ బైకుల విపణిలోకి ప్రవేశించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే తమ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించిన హీరో ఇప్పుడు కొత్త తరం కరిజ్మా బైకును రీలాంచ్ చేయడానికి డెవలప్ చేస్తోంది.
Recommended Video


హీరో మోటోకార్ప్ 200సీసీ కెపాసిటి గల సెగ్మెంట్లోకి ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ బైకుతో ప్రవేశించనుంది. దీని తరువాత తమ మోస్ట్ పాపులర్ మోటార్ సైకిల్ కరిజ్మాను న్యూ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి సిద్దమైనట్లు రిపోర్ట్స్ ద్వారా తెలిసింది.

హీరో మోటోకార్ప్ ఇండియాకు కరిజ్మా ఫ్లాగ్‌షిప్ మోడల్. ఆశించిన సేల్స్ లభించక, బ్రాండ్ వ్యాల్యూ నానాటికీ పడిపోవడంతో దీనిని ఇండియన్ మార్కెట్ నుండి తొలగించింది. అయితే, అఫీషియల్ వెబ్‌సైట్ నుండి మాత్రం కరిజ్మా జడ్ఎమ్ఆర్ ను అలాగే ఉంచారు.

రిపోర్ట్స్ మేరకు, హీరో మోటోకార్ప్ డిజైన్ ఇంజనీరింగ్ బృందం దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులతో కరిజ్మాను అభివృద్ది చేస్తోంది.

అయితే, వచ్చే రెండేళ్ల వరకు హీరో కరిజ్మా విపణిలోకి విడుదలయ్యే అవకాశాలు లేనట్లున్నాయి. హీరో ఈ కొత్త కరిజ్మా బైకును 2020లో జరగే ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించనుంది. ఇది 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ రానుంది.

మొదటి తరం కరిజ్మా సింపుల్ డిజైన్ మరియు టూరింగ్ లక్షణాలతో లాంచ్ అయ్యింది. అప్పట్లో సిటి మరియు లాంగ్ డ్రైవ్‌కు మంచి బైకుగా గుర్తింపు పొందింది. ఆ తరువాత సెకండ్ జనరేషన్ కరిజ్మాగా ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ టీమ్ డెవలప్ చేసిన ఆర్ మరియు జడ్ఎమ్ఆర్ బైకులను లాంచ్ చేయగా, వీటి డిజైన్ ఫస్ట్ జనరేషన్ కరిజ్మా కంటే ఘోరంగా ఉండటంతో క్లిక్ అవ్వలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కమ్యూటర్ మోటార్ సైకిల్ విభాగంలో హీరో మోటోకార్ప్ అధిపత్యం చెలాయిస్తోంది. అయితే, పర్ఫామెన్స్ బైకుల విభాగంలో తన సత్తా చాటుకోలేకపోయింది. ఇప్పుడు తమ ఫేమస్ బ్రాండ్ కరిజ్మా పేరుతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి సన్నద్దం అవుతోంది. పర్ఫామెన్స్ సెగ్మెంట్లో సక్సెస్ లక్ష్యంగా హీరో చాలా అగ్రెసివ్‌గా ఉంది.
Trending DriveSpark YouTube Videos


Click it and Unblock the Notifications








