హీరో ప్యాసన్ ప్రొ ఐస్మార్ట్ విడుదల: ధర రూ. 50,995 లు
హీరో మోటోకార్ప్ ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 50,995 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
హీరో మోటోకార్ప్ పరిచయం చేసిన ఐ3ఎస్ టెక్నాలజీని ఇప్పుడు ప్యాసన్ ప్రొ కమ్యూటర్ బైకులో అందించి ప్యాసన్ ప్రొ ఐస్మార్ట్ పేరుతో విపణిలోకి ప్రవేశపెట్టింది. ఐ3ఎస్‌తో పాటు బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోహెడ్‌ల్యాంప్(AOH) ఫీచర్‌ను జోడించింది.

హీరో మోటోకార్ప్ ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ ను మూడు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి,
- డ్రమ్ బ్రేకులు మరియు స్పోక్ వీల్స్ ధర రూ. 50,955 లు
- డ్రమ్ బ్రేకులు మరియు అల్లాయ్ వీల్స్ ధర రూ. 51,905 లు
- అల్లాయ్ వీల్స్ మరియు ముందు వైపు డిస్క్ బ్రేక్ ధర రూ. 53,805 లు అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.
- మట్టీ బ్రౌన్,
- మైస్టిక్ వైట్,
- బ్రాంజ్ యెల్లో,
- స్పోర్ట్స్ రెడ్ మరియు
- ఫోర్స్ సిల్వర్
- బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్,
- బ్లాక్ విత్ ఫ్రోస్ట్ బ్లూ మరియు
- బ్లాక్ విత్ హెవీ గ్రే

హీరో మోటోకార్ప్ ఇందులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అందించింది. ఇందులోని శక్తివంతమైన 97.2సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 8.24బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ప్యాసన్ ప్రొ లో సరికొత్త ఐ3ఎస్ ఫీచర్ కలదు. అంటే స్టార్ట్-స్టాప్ సిస్టమ్. ట్రాఫిక్‌లో మోటార్ సైకిల్‌ను ఐడిల్‌లో ఉంచినపుడు ఆటోమేటిక్‌గా ఇంజన్ ఆఫ్ చేయడం మరియు క్లచ్ ప్రెస్ చేసినపుడు స్టార్ట్ చేయడం వంటివి చేస్తుంది.

హీరో ప్యాసన్ ప్రొ ఐ స్మార్ట్ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి,

మూడు బ్లాక్ బేస్‌డ్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్స్ కలవు. అవి ,

డిజైన్ పరంగా హీరో ప్యాసన్ ప్రొ బోర్ గా అనిపిస్తోంది. అయితే మరిన్ని టూ వీలర్ల గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరియు యమహా తాజాగా విడుదల చేసిన ఎఫ్‌జడ్ 25 ఫోటో గ్యాలరీ మీ కోసం.


Click it and Unblock the Notifications








