ఒక్క రోజులో మూడు లక్షల టూ వీలర్లను విక్రయించిన హీరో

దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఒక్క దీపావళి పండుగ రోజునాడే 303,692 టూ వీలర్లను విక్రయించింది.

By Anil

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే అతి పెద్ద పండుగ బైకులు, కార్ల కంపెనీల పాలిట వరంగా మారింది. టూ వీలర్ల కంపెనీలు నెల మొత్తం జరిపే విక్రయాలు ఒక్క దీపావళి పండుగ రోజునే విక్రయించేస్తారు.

నమ్మశక్యంగా లేదా... అయినా ఇదే నిజం. దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఒక్క దీపావళి పండుగ రోజునాడే 303,692 టూ వీలర్లను విక్రయించింది.

హీరో టూ వీలర్ సేల్స్

ఆశ్చర్యంగా ఉంది కదూ... హీరో మోటోకార్ప్ ఒక్క రోజులోనే స్కూటర్లు మరియు బైకులు కలుపుకొని మూడు లక్షల యూనిట్లకు పైగా సేల్స్ నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీ కూడా ఒక్క రోజులో ఈ తరహా సేల్స్ సాధించలేదంటే నమ్మండి.

హీరో టూ వీలర్ సేల్స్

పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో టూ వీలర్లను అభివృద్ది చేసి విక్రయిస్తున్న హీరో ఉత్తర, మధ్య మరియు పశ్చిమ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ విక్రయాలు సాధించింది.

Recommended Video

Benelli TNT 300 ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
హీరో టూ వీలర్ సేల్స్

హీరో మోటోకార్ప్ గడిచిన సెప్టెంబర్ 2017 నెలలో మాత్రమే ఏడు లక్షల టూ వీలర్లను విక్రయించింది. ఇప్పటికీ మరే ఇతర కంపెనీ కూడా ఒక్క నెలలో ఈ రికార్డ్ సేల్స్ సాధించలేకపోయాయి. అంతే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండవ త్రైమాసికంలో 20 లక్షల టూ వీలర్ల సేల్స్ సాధించింది.

హీరో టూ వీలర్ సేల్స్

ఇప్పుడు ఒక్క దీపావళి రోజులోనే మూడు లక్షల యూనిట్లను విక్రయించడంతో ఈ నెల ఫలితాలు మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది. ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ మంది ఇంటికి కొత్త టూ వీలర్‌ను తీసుకెళ్లడం మరియు కొత్త్ ట్యాక్స్ విధానం ప్రకారం ధరలు స్వల్పగా తగ్గడంతో విక్రయాలు భారీగా నమోదయ్యాయి.

Trending On DriveSpark Telugu:

అక్కడ ఆదివారాల్లో కార్లను కడగడం కూడా నేరమే...!! ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింత నియామాలు

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలు

హీరో టూ వీలర్ సేల్స్

మొత్తం పండుగ సీజన్‌లో కంపెనీ దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా టూ వీలర్లను విక్రయించింది. అతి త్వరలో మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టి విక్రయాలను మరింత పెంచుకునేందుకు హీరో ప్రయత్నిస్తోంది.

హీరో టూ వీలర్ సేల్స్

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... హీరో మోటోకార్ప్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. హీరో ఈ స్థానాన్ని అందుకోవడంలో హీరో లైనప్‌లో ఉన్న స్ల్పెండర్ మోడల్ పాత్ర ప్రత్యేకం.

హీరో టూ వీలర్ సేల్స్

అయితే, స్కూటర్ల సెగ్మెంట్లో హోండాలోని ఆక్టివా శ్రేణి స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తుండటంతో హీరో స్కూటర్ల విభాగం తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. అయితే, ఇండియన్ 125సీసీ విభాగంలో ప్రవేశించేందుకు హీరో ప్రయత్నిస్తోంది.

Most Read Articles

English summary
Hero Motorcorp achieved its highest-ever single day retail sales on Dhanteras. Click for more details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X