150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్ ఆవిష్కరించి హోండా

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ 2017 బ్యాంకాక్ మోటార్ షో వేదిక మీద తమ సరికొత్త కాన్సెప్ట్ మోడల్ ఆవిష్కరించింది. దీనిని 150ఎస్ఎస్ రేసర్ పేరుతో ఆవిష్కరించింది. ఆధునిక ఫీచర్లు నూతన డిజైన్ ఫిలాసఫీతో హోండా దీనిని అభివృద్ది చేసింది. ఫీచర్లు, సాంకేతిక వివరాలతో పాటు మరిన్ని వివరాలు నేటి కథనంలో సవివరంగా తెలుసుకుందాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

హోండా ఈ రేసర్ 150ఎస్ఎస్ మోటార్ సైకిల్‌లో కండలు తిరిగిన ఫ్యూయ్ ట్యాంకు, పాత తరానికి చెందిన ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ ప్రేరిత హెడ్ ల్యాంప్ డిజైన్ ఇందులో అందించింది. అధికారికంగా హోండా దీనిని గురించిన మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న ఇందులోని అనేక విడిభాగాలు ప్రొడక్షన్‌కు సిద్దమయ్యే 150ఎస్ఎస్ రేసర్‌లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న సింగల్ సీట్ కు బదులుగా ప్రొడక్షన్ దశకు వచ్చే మోడల్‌ నందు డబుల్ సీటు రానుంది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

హోండా 150ఎస్ఎస్ రేసర్ లో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు ఉన్నాయి, మరియు రేసర్ స్టైల్‌కు మరింత లుక్‌ను చేకూర్చే విధంగా చిన్న పరిమాణంలో ఉన్న ఎగ్జాస్ట్ పైపు మరింత ఆకర్షణగా నిలిచింది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

ఇవి మినహాయిస్తే, ఇందులో పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్ మరియు బైకు మొత్తానికి అత్యంత ఆకర్షణీయంగా నిలిచే కండలు తిరిగిన ఇంధన ట్యాంకు ఇందులో రానుంది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

ఈ మధ్య కాలంలో గుండ్రటి హెడ్ ల్యాంప్ ఉన్న మోటార్ సైకిళ్లు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఇది దేశీయ విపణిలోకి విడుదల అయితే ప్రీమియమ్ రౌండ్ హెడ్ ల్యాంప్ మోటార్ సైకిల్ కెటగిరీలోకి చేరనుంది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

హోండా ఈ రేసర్ 150ఎస్ఎస్ బైకులో 20బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయగల లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్

హోండా 150ఎస్ఎస్ రేసర్ కాన్సెప్ట్‌లో ప్రీమియ్ శరీర భాగాలు రానున్నాయి. అందులో ముందువైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున అడ్జెస్టబుల్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు. మొత్తానికి విభిన్నమైన డిజైన్‌తో ఓ ఆసక్తికరమైన ఉత్పత్తిగా నిలిచింది.

Read more on: #హోండా #honda
English summary
Honda 150SS Racer Concept Revealed At Bangkok Motor Show
Story first published: Friday, March 31, 2017, 9:30 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark