సరికొత్త కలర్ ఆప్షన్‌లో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ హోండా ఆక్టివా

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి తమ పాపులర్ స్కూటర్‌లో మరో కొత్త కలర్ స్కీమ్‌ను నిశ్శబ్దంగా పరిచయం చేసింది.

జపాన్‌కు చెందిన అగ్రగామి దిచక్రవాహన తయారీ దిగ్గజం హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం విపణిలోకి ఆక్టివా 4జి స్కూటర్‌ను మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

హోండా ఆక్టివా 4జీ

హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం తమ ఆక్టివాలో కొత్త కలర్ ప్రవేశపెట్టడం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, తమ ప్రొడక్ట్ లైనప్‌ వెబ్‌సైట్లో ఈ నూతన కలర్ ఆప్షన్‌ను చేర్చింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
హోండా ఆక్టివా 4జీ

ఇతర కలర్ ఆప్షన్‌లో లభించే ఆక్టివా 4జీ స్కూటర్ల ధరతో పోల్చుకుంటే, ఈ మ్యాట్ ఆక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా కూడా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

హోండా ఆక్టివా 4జీ

సాంకేతికంగా ఆక్టివా 4జీ స్కూటర్లో 109సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా ఆక్టివా 4జీ

హోండా ఆక్టివా 4జీ లోని ప్రధానమైన ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్, కాంబి బ్రేక్ సిస్టమ్, ట్యూబ్ లెస్ టైర్లు మరియు ఆప్షనల్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా ఆక్టివా 4జీ

హోండా ఆక్టివా 4జీ స్కూటర్‌ను మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌తో పాటు మొత్తం ఏడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, ట్రాన్స్ బ్లూ మెటాలిక్, పర్ల్ అమేజింగ్ వైట్, మాజెస్టిక్ బ్రౌన్ మెటాలిక్, మ్యాట్ సెలెన్ సిల్వర్ మెటాలిక్.

హోండా ఆక్టివా 4జీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా టూ వీలర్ల ఫ్యామిలీలో ఆక్టివా సిరీస్ స్కూటర్లు అత్యధిక విక్రయాలు జరుపుతున్నాయి. అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభ కానున్న నేపథ్యంలో ఈ మధ్య ట్రెండింగ్ మారిన మ్యాట్ గ్రే కలర్ ఆప్షన్‌లో ఆక్టివా 4జీ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: Honda Activa 4G Matte Grey Colour Launched In India
Story first published: Tuesday, August 8, 2017, 13:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark