జిఎస్‌టి తరువాత హోండా ఆక్టివా ధరలు

Written By:

భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్‌గా పేరుగాంచిన హోండా ఆక్టివా మీద జిఎస్‌టి ప్రభావం ధర తగ్గుదలకు కారణమయ్యింది. జిఎస్‌టి ప్రకారం అన్ని టూ వీలర్ల మీద నిర్ధిష్ట ట్యాక్స్ 28 శాతంగా ఉంది. గతంలో ఇది 30 శాతంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఆక్టివా మీద 2 శాతం మేర ట్యాక్స్ తగ్గింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జిఎస్‌టి తరువాత హోండా ఆక్టివా ధరలు

350సీసీ లోపు ఉన్న టూ వీలర్ల మీద 28 శాతం మరియు 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీద 28 శాతం మరియు 3 శాతం సెస్ కలుపుకుని 31 శాతంగా నిర్ణయించడం జరిగింది. జిఎస్‌టికి ముందు అన్ని టూ వీలర్ల మీద 30 శాతం ట్యాక్స్ ఉండేది. కాబట్టి ఆక్టివా మీద రెండు శాతం ట్యాక్స్ తగ్గింది.

జిఎస్‌టి తరువాత హోండా ఆక్టివా ధరలు

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లైనప్‌లో మంచి విక్రయాలు సాధిస్తున్న మోడల్ ఆక్టివా స్కూటర్, అంతే కాకుండా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ జాబితాలో ఆక్టివా తొలిస్థానంలో నిలిచింది.

జిఎస్‌టి తరువాత హోండా ఆక్టివా ధరలు

హోండా కంపెనీ ఆక్టిలా 4జీ స్కూటర్ మీద రూ. 442 లు తగ్గించింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ. 50,730 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అదే విధంగా ఆక్టివా 125 మీద రూ. 443 లు వరకు తగ్గింది. దీంతో జిఎస్‌టి అనంతరం ఢిల్లీలో ఆక్టివా 125 ధర రూ. 61,361 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

జిఎస్‌టి తరువాత హోండా ఆక్టివా ధరలు

హోండా స్కూటర్ల లైనప్‌లో ఉన్న డియో మీద కూడా రూ. 328 ల వరకు తగ్గింది. జిఎస్‌టి అనంతరం దీని ధర రూ. 49,239 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది. సాధారణ ఆక్టివాలోని 109.19సీసీ ఇంజన్ గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు ఆక్టివా 125 లోని 124.9సీసీ ఇంజన్ గరిష్టంగా 8.52బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

Read more on: #హోండా #honda
English summary
Honda Activa Prices Drop Post GST Read In Telugu
Story first published: Tuesday, July 4, 2017, 10:16 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark