బిఎస్-IV ఇంజన్‌తో హోండా ఆక్టివా ఐ విడుదల: ధర రూ. 47,913 లు
హోండా టూ వీలర్ల తయారీ దిగ్గజం తమ బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ ఆక్టివాలోని ఐ వేరియంట్‌ను బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ జోడింపుతో విడుదల చేసింది.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ 2017 ఆక్టివా ఐ స్కూటర్‌ను బిఎస్-IV మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ అందించి మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 47,913 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

స్కూటర్ల సెగ్మెంట్లో నాయకత్వాన్ని వహిస్తున్న బ్రాండ్ ఆక్టివా. ఆక్టివా బ్రాండ్ పేరును మరింత పటిష్ట పరుచుకునేందుకు ఇందులోని వేరియంట్లలో కేంద్రం తప్పనిసరి చేసిన బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ అందించింది.

డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లతో మళ్లీ అందుబాటులోకి వచ్చిన ఆక్టివా ఐ వేరియంట్ ధర రూ. 47,913 లు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా అందుబాటులో ఉంది.

ఆక్టివాలోని సాధారణ వేరియంట్‌తో పోల్చుకుంటే ఆక్టివా ఐ లైట్ వెయిట్‌తో మరియు కాంపాక్ట్ డిజైన్‌లో ఉంటుంది. 2016 ఏడాదిలో భారత దేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్‌గా హోండా ఆక్టివా నిలిచింది.

హోండా ఆక్టివా ఐ స్కూటర్‌లో 110 సీసీ సామర్థ్యం ఉన్న హోండా ఎకో టెక్నాలజీ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.74ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హోండా ఆక్టివా ఐ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి, ఆర్చిడ్ పర్పుల్ మెటాలిక్, లష్ మ్యాగ్నెటా మెటాలిక్, నియో ఆరేంజ్ మెటాలిక్, బ్లాక్ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్.

హోండా ఆక్టివా బ్రాండ్ క్రింద, ఆక్టివా ఐ, ఆక్టివా 4జీ, మరియు ఆక్టివా 125 అనే మోడళ్లను హోండా టూ వీలర్స్ విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








