జిఎస్‌టి ప్రభావం: ఆక్టివా, యూనికార్న్‌లపై 3-5 శాతం తగ్గనున్న ధరలు

Written By:

హోండా టూ వీలర్స్ ఇండియా లిమిటెడ్ తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఆక్టివా మరియు యూనికార్న్ బైకు మీద 3 నుండి 5 శాతం ధర తగ్గించనుంది. నూతన పన్ను విధానానికి అనుగుణంగానే ఈ ధరలను తగ్గించనున్నట్లు తెలిసింది.

ఆక్టివా మరియు యూనికార్న్‌పై ధరల తగ్గింపు

జూలై 1, 2017 నుండి జిఎస్‌టి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా అన్ని ట్యాక్స్‌లను లెక్కించిన అనంతరం, తమ ఉత్పత్తులకు నూతన ధరలను నిర్ణయించి, తగ్గిన ధర వివరాలను వెల్లడించనుంది.

ఆక్టివా మరియు యూనికార్న్‌పై ధరల తగ్గింపు

అయితే నూతన వస్తు సేవల పన్ను ప్రకారం, జిఎస్‌టి స్లాబుల్లో అదనంగా 1 సెస్ ను అమలు చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఏదేమయినప్పటికీ జిఎస్‌టి అమలయితే, దానికి అనుగుణంగా ధరలను సవరించనున్నారు.

ఆక్టివా మరియు యూనికార్న్‌పై ధరల తగ్గింపు

ఇప్పటికే దేశీయ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థలు బజాజ్ ఆటో మరియు రాయల్ ఎన్ఫీల్డ్ తమ ఉత్పత్తుల మీద ధరలు తగ్గించాయి. అయితే, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ల్ ఇండియా లిమిటెడ్ తగ్గించిన ధరలను జూలై మొదటి వారం నుండి అమలు చేయనుంది.

ఆక్టివా మరియు యూనికార్న్‌పై ధరల తగ్గింపు

ధరల తగ్గింపు గురించి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ల్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గులేరియా స్పందిస్తూ, " జిఎస్‌టి అమలైన తరువాత వాటి పన్నులు వివిధ రాష్ట్రాలకు మరియు వివిధ ఉత్పత్తులకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 3 నుండి 5 శాతం వరకు ధరలు తగ్గించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు".

ఆక్టివా మరియు యూనికార్న్‌పై ధరల తగ్గింపు

బజాజ్, రాయల్ ఎన్పీల్ మరియు హోండా ధరల తగ్గింపు బాటపట్టగా, ఇతర టూ వీలర్ సంస్థలైన టీవీఎస్ టూ వీలర్స్, హీరో మోటోకార్ప్, యమహా మరియు సుజుకి కూడా జూలై 1, 2017 నుండి జిఎస్‌టి అనుధరలను సవరించనున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ధరల తగ్గింపులో ఏ టూ వీలర్ల తయారీ సంస్థ గొప్పతనం లేదు. దేశ ప్రజల మీద పన్ను భారం తగ్గించేందుకు కేంద్రం జిఎస్‌టి అమలు చేయడం ద్వారా టూ వీలర్ల ధరలు తగ్గుతున్నాయి. ఇక హోండాకు చెందిన ఆక్టివా మరియు ఇతర మోడళ్లను ఎంచుకునే వారు జూలై 1 నుండి కొనుగోలు చేయడం ఉత్తమం.

Read more on: #హోండా #honda
English summary
Read In Telug: GST Effect: Honda To Cut Prices Of Activa And Unicorn

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark