సిబిఆర్650 ఎఫ్ మీద భారీగా ధర తగ్గించిన హోండా

Written By:

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా టూ వీలర్స్, దేశీయంగా తక్కువ సామర్థ్యం ఉన్న ఎంట్రీ లెవల్ టూ వీలర్లతో పాటు, ఎక్కువ సామర్థ్యం ఉన్న స్పోర్ట్స్ బైకులను విక్రయిస్తోంది. అయితే ఖరీదైన స్పోర్టివ్ బైకుల సెగ్మెంట్లో ఆశించిన మేర రాణించలేకపోతోంది. అందు కోసం ఖరీదైన బైకుల మీద ధరలను తగ్గించడం ప్రారంభించింది.

అందులో భాగంగా సిబిఆర్650ఎఫ్ మోటార్ సైకిల్ మీద భారీ మొత్తం మీద ధర తగ్గించినట్లు అధికారికంగా ప్రకటించింది.

హోండా సిబిఆర్650ఎఫ్ మీద తగ్గిన ధర

హోండా టూ వీలర్స్ తమ సిబిఆర్650ఎఫ్ మోటార్ సైకిల్‌ను రూ. 7.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించేది, అయితే ధరల సవరణ అనంతరం ఇప్పుడు దీని ధర రూ. 6,57,620 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

హోండా సిబిఆర్650ఎఫ్ మీద తగ్గిన ధర

ఆరు లక్షలు పైబడి ధరతో ఉన్న దీని ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా...? హోండా ఈ సిబిఆర్650ఎఫ్ లో శక్తివంతమైన 649సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌తో చల్లబడే నాలుగు సిలిండర్ల ఇంజన్ కలిగి ఉంది. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 85బిహెచ్‌పి పవర్ మరియు 63ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

హోండా సిబిఆర్650ఎఫ్ మీద తగ్గిన ధర

ఏప్రిల్ 1, 2017 నుండి అన్ని మోటార్ సైకిళ్లలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అందివ్వడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో హోండా తమ సిబిఆర్650ఎఫ్ మీద భారీ మొత్తంలో ధరలు తగ్గించింది.

హోండా సిబిఆర్650ఎఫ్ మీద తగ్గిన ధర

హోండా సిబిఆర్650ఎఫ్ లో నూతన కలర్ ఆప్షన్‌లు, ఎల్ఇడి హెడ్ లైట్లు, మరియు అభివృద్ది పరచబడిన ఇంజన్‌లతో అప్‌గ్రేడ్స్ నిర్వహించింది. ఈ కొత్త మోడల్ వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా విక్రయాల్లోకి రానుంది.

హోండా సిబిఆర్650ఎఫ్ మీద తగ్గిన ధర

అప్‌డేట్స్‌కు గురైన ఈ బైకు లీటర్‌కు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు, 211కిలోల బరువున్న ఈ బైకులో భద్రత కోసం యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu Honda CBR650F Now Gets A Massive Price Cut
Story first published: Friday, June 9, 2017, 14:23 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark