పూనేలో విడుదలైన హోండా క్లిక్ స్కూటర్
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ పూనేలో క్లిక్ స్కూటర్‌ను రూ. 43,076 లు ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది.
హోండా టూ వీలర్స్ ఇది వరకే క్లిక్ స్కూటర్‌ను జూన్ 2017 లో విపణిలోకి విడుదల చేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో క్లిక్ స్కూటర్‌ను విడుదల చేసినట్లు హోండా తెలిపింది. 110సీసీ సామర్థ్యం ఉన్న స్కూటర్‌ను వీలైనంత వరకు అధిక సౌకర్యం, అనేక అవసరాలతో పాటు సౌలభ్యతకు ప్రత్యేకత ఇస్తూ అభివృద్ది చేసారు.

దేశవ్యాప్తంగా క్లిక్ స్కూటర్ లభ్యత గురించి హోండా డీలర్లను సంప్రదించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రూరల్ ఏరియాల్లో అందుబాటులోకి తెచ్చి, తరువాత నగరాల్లోని కస్టమర్ల మీద దృష్టిసారించనున్నట్లు తెలిపింది. హోండా క్లిక్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 43,076 లు మరియు హోండా క్లిక్ డీలక్స్(గ్రాఫిక్స్) ధర రూ. 43,569 లు ఎక్స్-షోరూమ్ (పూనే)గా ఉన్నాయి.

హోండా క్లిక్ ఇంజన్, స్పెసిఫికేషన్లు మరియు ట్రాన్స్‌మిషన్
సాంకేతికంగా క్లిక్ స్కూటర్‌లో 110సీసీ సామర్థ్యం గల బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ కలదు. కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. హోండా క్లిక్ గరిష్ట వేగం గంటకు 83కిలోమీటర్లుగా ఉంది.

క్లిక్ పేరు మిగతా స్కూటర్లతో పోల్చిచే ఎంతో భిన్నంగా ఉంది. దీని పేరులాగే, విభిన్న అవసరాలకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. విశాలమైన ఫుట్ బోర్డ్, అధిక పరిమాణంలో అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ మరియు ఆప్షనల్ రియర్ క్యారియర్ కలదు.

హోండా క్లిక్ స్కూటర్‌లోని ప్రత్యేక ఫీచర్లు....
- బ్లాక్ ప్యాట్రన్ టైర్లు(టైర్లు రోడ్డును తాకే భాగంలో చిన్న చిన్న బాక్స్ ఆకారంలో ఉన్న గ్రిప్)[స్కూటర్ల సెగ్మెంట్లో ఇలాంటి టైర్లను వినియోగించడం ఇదే తొలిసారి]
- మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్
- ఈక్విలైజర్ పరిజ్ఞానంతో హోండా వారి కాంబి బ్రేక్ సిస్టమ్(CBS)
- విభిన్న కలర్ ఆప్షన్స్: పాట్రోటిక్ రెడ్-వైట్, బ్లాక్, మరోకాన్ బ్లూ-వైట్ మరియు ఆర్కస్ గ్రే రంగుల్లో స్టాండర్డ్ మరియు గ్రాఫిక్ వేరియంట్లలో లభించును.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రాక్టికల్‌గా హోండా క్లిక్ బెస్ట్ స్కూటర్. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని అవసరాలకు అనుగుణంగా మరియు అన్ని రకాల సవాళ్లతో కూడిన రోడ్లను ఎదుర్కునే విధంగా ప్లాన్ చేసి నిర్మించారు. 110సీసీ సెగ్మెంట్లో ఇలాంటి మల్టీ పర్పస్ స్కూటర్ ఇదే కావడంతో హోండాకు క్లిక్ మంచి సక్సెస్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








