దక్షిణాదిలో విడుదలైన హోండా క్లిక్: ధర రూ. 44,524 లు

హోండా టూ వీలర్స్ దక్షిణాదిలోకి క్లిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

By Anil

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా దక్షిణ భారత దేశంలోకి తమ క్లిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. హోండా టూ వీలర్స్ ఇండియా ప్రతినిధులు తమిళనాడు విపణిలోకి చెన్నై వేదికగా క్లిక్ స్కూటర్‌ను రూ. 44,524 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్(చెన్నై) ధరతో విడుదల చేశారు.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

హోండా క్లిక్ స్కూటర్‌ సెమీ అర్బన్ మరియు రూరల్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడింది. విశాలమైన మరియు ధృడమైన ముందు భాగం, పొడవాటి సౌకర్యవంతమైన సీటు, అధిక అండర్ సీట్ స్టోరేజ్, వెనుక వైపు ట్యూబులర్ గ్రాబ్ రెయిల్ వంటివి ఉన్నాయి.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా క్లిక్ స్కూటర్ విడుదల

హోండా ఆక్టివాతో పోల్చుకుంటే సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ క్లిక్ స్కూటర్‌ను అభివృద్ది చేసారు. హోండా ఆక్టివా కన్నా క్లిక్ స్కూటర్ బరువు ఆరు కిలోల వరకు తక్కువగా ఉంది. హోండా క్లిక్‌లో సీటు ఎత్తు 743ఎమ్ఎమ్‌గా(అతి తక్కువ ఎత్తు)ఉంది.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

స్త్రీ మరియు పురుషులకు సరిపోయేలా తక్కువ ఎత్తు మరియు తక్కువ బరువుతో రూపొందించామని హోండా తెలిపింది. ఇందులోని గరిష్టంగా 3.5-లీటర్ల సామర్థ్యమున్న ఫ్యూయల్ ట్యాంక్ కలదు.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

క్లిక్ స్కూటర్‌లో ముందు మరియు వెనుక వైపున అధిక గ్రిప్ గల టైర్లు ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ఎగుడుదిగుడు రోడ్ల మీద అత్యుత్తమ పటిష్టత్వాన్ని కలిగి ఉంటుంది. స్కూటర్ మీద అదనపు క్యారీర్‌ను అటాచ్ చేసుకోవచ్చు, ముందు వైపున విశాలమైన ఫుట్ బోర్డ్ కలదు.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

అదనంగా హోండా క్లిక్ స్కూటర్‌లో హోండా కాంబ్రి బ్రేకింగ్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ట్యూబ్ లెస్ టైర్లు మరియు మెయింటనెన్స్ రహిత బ్యాటరీ లతో పాటు, ఫ్రంట్ స్క్రీన్, ఫ్లోర్ కవర్, బాక్స్ సెంటర్, క్యాప్ కవర్ మరియు రియర్ గ్రిప్ వంటి అదనపు యాక్ససరీలను పొందవచ్చు.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

సాంకేతికంగా హోండా క్లిక్ స్కూటర్‌లో 109.19సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8.04బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా క్లిక్ స్కూటర్ విడుదల

హోండా టూ వీలర్స్ ఆక్టివా స్కూటర్‌లో అందించిన అదే 110సీసీ ఇంజన్‌ను క్లిక్ స్కూటర్‌లో అందించడం జరిగింది. హోండా క్లిక్ స్కూటర్‌ను నాలుగు విభిన్న ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అవి,

  • ప్యాట్రిక్ రెడ్ విత్ వైట్,
  • మోరోకాన్ బ్లూ మరియు వైట్,
  • ఆర్కస్ గ్రే,
  • బ్లాక్ వంటి రంగులతో పాటు స్టాండర్డ్ మరియు బాడీ గ్రాఫిక్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు.
  • హోండా క్లిక్ స్కూటర్ విడుదల

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    హోండా లైనప్‌లో ఉన్న మిగతా అన్ని స్కూటర్లతో పోల్చుకుంటే క్లిక్ అత్యంత తేలికపాటు బరువున్న స్కూటర్. సీటు ఎత్తు కూడా మధ్యస్థంగా ఉండటంతో మహిళలు మరియు పురుషులు దీనిని రోజు వారి అవసరాలకు ఉపయోగించవచ్చు. ధర పరంగా అతి తక్కువ ధరతో, శక్తివంతమైన ఇంజన్ మరియు ప్రాథమిక ఫీచర్లను కలిగి ఉన్న స్కూటర్ ప్రతి ఒకరికీ అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 23, 2017, 13:13 [IST]
English summary
Read In Telugu: Honda Cliq Launched In Tamilnadu Launch Price Mileage Specifications Images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+