మార్కెట్లోకి క్లిక్(Cliq) స్కూటర్ విడుదల చేసిన హోండా: ధర, ఇంజన్ మరియు స్పేసిఫికేషన్స్

Written By:

హోండా టూ వీలర్స్ ఇండియా విభాగం గతంలో విడుదల చేసిన నవీ టూ వీలర్ శైలిలో మరో స్కూటర్ ప్రవేశపెట్టింది. నవీ డిజైన్ లక్షణాలతో ఉన్న క్లిక్ స్కూటర్‌ను రూ. 42,499 లు ప్రారంభ ధరకు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

హోండా క్లిక్ స్కూటర్

హోండా ఆక్టివా స్కూటర్ దేశవ్యాప్తంగా సంచలనాత్మక విక్రయాలు సాధిస్తోంది. దీనికి తోడుగా, నూతన డిజైన్ శైలిలో వచ్చిన క్లిక్ స్కూటర్ అడ్వెంచర్ తరహాలో, పెద్ద పరిమాణంలో ఉన్న ప్రంట్ డిజైన్, పెద్ద సీటు, దాని క్రింద అధిక స్టోరేజి సామర్థ్యం కలదు.

హోండా క్లిక్ స్కూటర్

ఆక్టివాతో పోల్చుకుంటే చూడటానికి పెద్దగా కనిపించినప్పటికీ దానికి తక్కువ పొడవుగా, ఆరు కిలోల తక్కువ బరువుతో ఉంది. అడ్వెంచర్ రైడింగ్ కోసం మాత్రమే కాదండోయ్, యుటిలిటి అవసరాలకు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.

హోండా క్లిక్ స్కూటర్

నూతన హోండా క్లిక్ స్కూటర్ సీటు ఎత్తు 743ఎమ్ఎమ్ గా ఉంది. హోండా దీనిని యూనిసెక్స్ స్కూటర్‌గా పరిగణిస్తోంది. అంటే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరికీ సరిపోయేవిధంగా అభివృద్ది చేశారన్నమాట.

హోండా క్లిక్ స్కూటర్

హోండా క్లిక్ లో 3.5-లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఇది నవీ మరియు ఆక్టివా స్కూటర్లలో కన్నా తక్కువే. విశాలమైన పుట్ బోర్డులో, కావాలంటే క్యారియర్ అమర్చుకోవచ్చు. అత్యుత్తమ గ్రిప్ ప్యాట్రన్ టైర్లు ఉన్నాయి.

హోండా క్లిక్ స్కూటర్

వీటికి తోడుగా హోండా తమ క్లిక్ స్కూటర్‌లో కాంబి బ్రేక్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ట్యూబ్ లెస్ టైర్లు, మెయింటెనెన్స్ రహిత బ్యాటరీ వంటివి ప్రత్యేకతలున్నాయి.

హోండా క్లిక్ స్కూటర్

హోండా టూ వీలర్స్ క్లిక్ స్కూటర్‌లో 109.19సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందివ్వడం జరిగింది. ఇది గరిష్టంగా 8.04బిహెచ్‌పి పవర్ మరియు 8.94ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. హోండా ప్రకారం ఇది గరిష్టంగా గంటకు 83కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ స్కూటర్ మార్కెట్ రోజురోజుకీ పుంజుకుంటోంది. దేశీయంగా స్కూటర్ల విభాగాన్ని హోండా శాసిస్తోంది. మరిన్ని స్కూటర్ల విడుదలతో పట్టును పెంచుకోవడానికి నూతన ఉత్పత్తులను ప్రవేశపెడుతోంది. పోటీదారులు ఊహించని విధంగా రాత్రికిరాత్రే క్లిక్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu Honda Cliq Launched In India — Priced At Rs 42,499
Story first published: Wednesday, June 21, 2017, 11:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark