తొలి 50 ఆఫ్రికా ట్విన్ బైకుల డెలివరీ ప్రారంభించిన హోండా

Written By:

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి అడ్వెంచర్-టూరింగ్ ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్ 1000ఎల్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది.

ఇప్పుడు, ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు హోండా ప్రకటించింది. తొలి 50 మోటార్ సైకిళ్లను కంప్లీట్లి నేక్డ్ డౌన్ యూనిట్లను కంపెనీ యొక్క మానేసర్ ప్లాంటులో అసెంబుల్ చేసింది. ఈ 50 బైకుల మీద బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ఇవ్వనున్నట్లు హోండా పేర్కొంది.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా ఆఫ్రికా ట్విన్ బైకుల డెలివరీ ప్రారంభం

సాంకేతికంగా హోండా ఆఫ్రికా ట్విన్ సిఆర్ఎఫ్ 1000ఎల్ మోటార్ సైకిల్‌లో 998సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ప్యార్లల్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 93బిహెచ్‌పి పవర్ మరియు 98ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ బైకుల డెలివరీ ప్రారంభం

హోండా ఆఫ్రికా ట్విన్‌ను కమర్షియల్‌గా విడుదల చేసినప్పుడు దీని ధర రూ. 12.9 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండేది. ఇప్పుడు దీని ధర రూ. 13,06,927 లు ఎక్స్-షోరూమ్ ఇండియాగా ఉంది.

హోండా ఆఫ్రికా ట్విన్ బైకుల డెలివరీ ప్రారంభం

హోండా ఆఫ్రికా ట్విన్‌కు దేశీయంగా మంచి డిమాండ్ లభించింది. ముందుగా అనుకున్న ప్రకారం కేవలం 50 యూనిట్లను మాత్రమే విక్రయించాలని హోండా భావించింది. అయితే కేవలం 2 నెలల కాలంలో 50 యూనిట్లు బుక్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 22 ప్రధాన నగరాల్లోని 22 డీలర్ల వద్ద హోండా ఆఫ్రికా ట్విన్ లభిస్తోంది.

హోండా ఆఫ్రికా ట్విన్ బైకుల డెలివరీ ప్రారంభం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి ఆరవ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్‌ బ్రాండ్‌గా హోండా తమ ఆఫ్రికా ట్విన్‌ను విడుదల చేసింది. ఆఫ్రికా ట్విన్‌తో కలుపుకుని మొత్తం ఆరు అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. ఆఫ్రికా ట్విన్ మోటార్ సైకిల్‌కు పోటీగా ట్రయంప్, డుకాటి, బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్, సుజుకి మోటార్ సైకిల్స్ మరియు కవాసకి సంస్థలు అడ్వెంచర్ టూరింగ్ బైకులను విక్రయిస్తున్నాయి.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: Honda Commences Deliveries Of The Africa Twin, With The First Batch Of 50 Motorcycles
Story first published: Tuesday, August 1, 2017, 19:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark