2018 హోండా గోల్డ్ వింగ్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు, ఫోటోలు

Written By:

హోండా టూ వీలర్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే మోడళ్లు యాక్టివా మరియు షైన్. దేశవ్యాప్తంగా విస్తరించిన హోండా టూ వీలర్స్ కేవలం కమ్యూటర్ టూ వీలర్లను మాత్రమే విక్రయిస్తోందనకుంటే పొరబడినట్లే. ఎందుకంటే 50 వేల ధరలోపే కాదు 25 లక్షల పైబడి విలువైన మోటార్ సైకిళ్లను కూడా హోండా ఇండియా విక్రయిస్తోంది.

2018 హోండా గోల్డ్ వింగ్

నిజమే, హోండా టూ వీలర్స్ ఇండియా నేడు విపణిలోకి 2018 గోల్డ్ వింగ్ మోటార్ సైకిల్‌ను రూ. 26.85 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లాంచ్ చేసింది. ఇందులోని ప్రత్యేకతలు మరియు సాంకేతిక వివరాల గురించి మరిన్ని వివరాలు నేటి కథనంలో...

Recommended Video - Watch Now!
Honda Africa Twin Features And Driving Modes Explained - DriveSpark
2018 హోండా గోల్డ్ వింగ్

సరికొత్త హోండా గోల్డ్ వింగ్ బైకులో హోండా వారి డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్(DC) టెక్నాలజీ వచ్చింది. హోండా ఈ పరిజ్ఞానాన్ని వినియోగించడం ఇదే తొలిసారి. 2018 వెర్షన్ హోండా గోల్డ్ వింగ్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 హోండా గోల్డ్ వింగ్

సాంకేతికంగా 2018 హోండా గోల్డ్ వింగ్ బైకులో ఫ్లాట్ ఆరు సిలిండర్ల ఇంజన్ కలదు. ప్రతి సిలిండరుకు నాలుగు వాల్వులు ఉన్నాయి. హోండా అందించే మునుపటి ఇంజన్‌తో పోల్చుకుంటే దీని ఇది 6.2కిలోల వరకు తేలికైనది.

2018 హోండా గోల్డ్ వింగ్

హోండా టూరింగ్ ఐకాన్ మోడల్ గోల్డ్ వింగ్ సుమారుగా నాలుగు దశాబ్దాల అనంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్ఫామెన్స్ మరియు లగ్జరీ ఫీచర్లతో వచ్చింది. సరికొత్త డిజైన్ మరియు నూతన ఛాసిస్ మీద హోండా దీనిని నిర్మించింది.

2018 హోండా గోల్డ్ వింగ్

2018 హోండా గోల్డ్ వింగ్ చాలా పదునైన చూపులను కలిగి ఉంది. ముందు వైపు చిన్నగా ఉన్న ఫెయిరింగ్, ఎలక్ట్రిక్ పవర్ సాయంతో అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం ఉన్న ఫ్రంట్ విండ్ స్క్రీన్, ఆనందకరమైన జర్నీ కోసం సౌకర్యవంతమైన సీటు మరియు లాంగ్ రైడింగ్ కోసం పిలియన్ కూడా ప్రయాణించే వీలును హోండా కల్పించింది.

2018 హోండా గోల్డ్ వింగ్

రెండు పెద్ద ప్యానియర్ బ్యాగులు ఉన్నాయి. వీటిలో 110-లీటర్ల స్టోరేజ్ కెపాసిటి మరియు ఎన్నో కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే ప్రధానంగా జరిగిన మార్పులో 7-అంగుళాల పరిమాణం ఉన్న ఫుల్ కలర్ టిఎఫ్‌టి స్క్రీన్ మునుపటి మోడల్‌లో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ స్థానాన్ని భర్తీ చేసింది.

2018 హోండా గోల్డ్ వింగ్

ఇందులో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. అయితే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మిస్సయ్యింది. ఇతర ఫీచర్లయిన పూర్తి స్థాయి ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఆటో క్యాన్సలింగ్ ఇండికేటర్లు మరియు స్మార్ట్ కీ కంట్రోల్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా గోల్డ్ వింగ్

జపాన్ దిగ్గజం లాంచ్ చేసిన గోల్డ్ వింగ్ బైకులో థ్రోటిల్ బై వైర్ టెక్నాలజీ వచ్చింది. ఇందులో నాలుగు విభిన్నమైన రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, టూర్, స్పోర్ట్, ఎకోన్ మరియు రెయిన్. అదనంగా హోండా స్టెబిలిటి టార్క్ కంట్రోల్ కలదు, ఇది సస్పెన్షన్ డ్యాంపింగ్‌ను పర్యవేక్షిస్తుంది.

2018 హోండా గోల్డ్ వింగ్

భద్రత పరంగా హోండా గోల్డ్ వింగ్ మోటార్ సైకిల్‌లో ఫోర్స్ ఐడిలింగ్ స్టాప్ మరియు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఫర్ క్విక్ స్టార్ట్, యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అత్యుత్తమ కంట్రోల్ డ్యూయల్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా గోల్డ్ వింగ్

2018 హోండా గోల్డ్ వింగ్ బైకులో గల 1822సీసీ కెపాసిటి గల ఆరు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 125బిహెచ్‌పి పవర్ మరియు 4,500ఆర్‌పిఎమ్ వద్ద 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

2018 హోండా గోల్డ్ వింగ్

2018 హోండా గోల్డ్ వింగ్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, స్టాండర్డ్ మరియు గోల్డ్ టూర్. మరియు ఇవి క్యాండీ అర్డెంట్ రెడ్ కలర్‌లో లభిస్తోంది. హోండా ఇప్పటికే ఈ మోడల్ మీద బుకింగ్స్ ప్రారంభించింది. బుక్ చేసుకున్న వారికి కొత్త సంవత్సరం నుండి డెలివరీలను ఇవ్వనున్నట్లు హోండా తెలిపింది.

2018 హోండా గోల్డ్ వింగ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఖరీదైన లగ్జరీ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో రాణించేందుకు హోండా తమ గోల్డ్ వింగ్ బైకును దేశీయంగా లాంచ్ చేసింది. ఇది మార్కెట్లో ఉన్న ఇండియన్ రోడ్ మాస్టర్, హ్యార్లీ డేవిడ్సన్ సివిఒ లిమిటెడ్ మరియు ఇలాంటి శ్రేణి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: 2018 Honda Gold Wing Launched In India; Prices Start At Rs 26.85 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark