TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హోండా గ్రాజియా 125 స్కూటర్ గురించి 7 ముఖ్యమైన విషయాలు
భారతదేశపు అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థగా పేరుగాంచిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ అతి త్వరలో ఖరీదైన ఆటోమేటిక్ స్కూటర్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. గ్రాజియా పేరుతో విపణిలోకి రానున్న స్కూటర్ గురించి 7 ముఖ్యమైన విషయాలు ఇవాళ్టి కథనంలో....
హోండా వారి అత్యంత ఖరీదైన స్కూటర్
గ్రాజియా 125 స్కూటర్ హోండా స్కూటర్ల లైనప్‌లోనే అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది. ఇది విపణిలో ఉన్న హోండా ఏవియేటర్ స్కూటర్ పై స్థానాన్ని భర్తీ చేయనుంది. వెస్పా స్కూటర్‌కు పోటీగా వస్తున్న గ్రాజియా స్కూటర్ భారీ ధరతో విడుదలవ్వనుంది.
అదే ప్రాణం... కొత్త శరీరం...
హోండా గ్రాజియా 125 స్కూటర్ చూడటానికి చాలా కొత్తగా కనబడుతుంది. అయితే, దీనిని ఆక్టివా మరియు నవీ టూ వీలర్లను రూపొందించిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. సాంకేతికంగా ఇందులో ఆక్టివా 125 ఇంజన్ అందివ్వడం జరిగింది.
హోండా గ్రాజియా బుకింగ్స్
రెండు వారాల క్రితం వరకు గ్రాజియా స్కూటర్ గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే ఉన్నఫలంగా ఫోటోలు లీకైన అనతి కాలంలో హోండా గ్రాజియా స్కూటర్ మీద అఫీషియల్‌గా బుకింగ్స్ ప్రారంభించింది. ఈ స్కూటర్‌ను దేశవ్యాప్తంగా ఉన్న హోండా టూ వీలర్స్ డీలర్ల వద్ద రూ. 2,000 ల టోకన్ ధర చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
అధునాతన టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్
ప్రస్తుతం మార్కెట్లో గల ఎన్నో స్కూటర్లు టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్ కలిగి ఉన్నాయి. అయితే, ఇందులో లాంగ్ ట్రావెల్ మరియు స్మూత్ రైడింగ్ కల్పించే సస్పెన్షన్ కలదు. మిగతా స్కూటర్లతో పోల్చితే హోండా గ్రాజియాలోని ఫ్రంట్ వీల్‍కు దీనిని అందివ్వనుంది.
ఎల్ఇడి హెడ్ లైట్లతో...
హోండా తాజాగ గ్రాజియా 125 స్కూటర్ టీజర్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. అందులో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ గల గ్రాజియా ఫ్రంట్ ప్రొఫైల్ ఇది. ఎల్ఇడి హెడ్ ల్యాంప్‌తో వచ్చిన మొదటి స్కూటర్ గ్రాజియానే కానుంది. పగటి పూట వెలిగ్ ఎల్ఇడి లైట్లు హోండా డియో మరియు గ్రాజియా స్కూటర్‌లో ఉన్నాయి.
డిస్క్ బ్రేకు
ఇండియాలో లభ్యమవుతున్న స్కూటర్లన్నింటిలో డిస్క్ బ్రేకులు సాధారణంగా ఉండవు, కేవలం కొన్ని టాప్ ఎండ్ వేరియంట్ స్కూటర్లలోనే ఉంటాయి. అయితే, హోండా ఆక్టివా 125 తరహాలో ఉన్నటువంటి ఫ్రంట్ డిస్క్ బ్రేకును కాంబి-బ్రేక్ సిస్టమ్(CBU)తో సహా గ్రాజియా స్కూటర్‌లో తప్పనిసరిగా రానుంది.
విడుదల
రిపోర్ట్స్ నుండి వచ్చిన సమాచారం మేరకు, హోండా గ్రాజియా 125 స్కూటర్ నవంబరు తొలివారంలో మార్కెట్లోకి విడుదలవ్వనుంది. ఇప్పటికే హోండా దీని మీద దేశవ్యాప్తంగా అధికారిక బుకింగ్స్ ఆహ్వానిస్తోంది. విడుదల అనంతరం నవంబరు నెల మలిసగంలో డెలివరీ ఇవ్వనుంది.