హోండా నుండి గ్రాజియా 125 స్కూటర్: ఫీచర్లు, ఫోటోలు మరియు విడుదల వివరాలు

హోండా టూ వీలర్స్ ఇండియన్ స్కూటర్ల మార్కెట్లోకి సరికొత్త గ్రాజియా 125 స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. హోండా గ్రాజియా 125 ప్రీమియమ్ స్కూటర్లు ఇప్పటికే పలు డీలర్లను చేరాయి.

By Anil

భారతదేశపు అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ అతి త్వరలో ఇండిన్ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. అధికారిక విడుదలకు ముందే హోండా అవుట్‌లెట్లను చేరిన గ్రాజియా 125 స్కూటర్ ఫోటోలు తాజాగా రివీల్ అయ్యాయి.

హోండా గ్రాజియా 125

మెట్రోపాలిటన్ సిటీలను మరియు యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ హోండా తమ గ్రాజియా 125 ప్రీమియమ్ స్కూటర్‌ను అభివృద్ది చేసింది. హోండా వారి అడ్వాన్స్‌డ్ అర్బన్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ స్కూటర్‌ను నిర్మించింది.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా గ్రాజియా 125

గ్రాజియా 125 హోండా ఆక్టివా ఫ్లాట్‌ఫామ్ కూడా ఉపయోగించుకుంది. ఫ్రంట్ ఆప్రాన్ మీద అందించిన విశాలమైన హెడ్ ల్యాంప్స్ మరియు ఇండికేటర్ ల్యాంప్స్ ఉన్నాయి. స్పోర్టివ్ లుక్ కల్పించేందుకు కండలి తిరిగిన బాడీ డీకాల్స్‌ను జోడించారు.

హోండా గ్రాజియా 125

రహస్యంగా లీకైన ఫోటోల ప్రకారం, హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో సెమీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ గుర్తించవచ్చు. మరియు హోండా ఆక్టివా 125 తరహాలో కాకుండా మెటల్‌తో నిర్మించిన ఆల్ ఫైర్ బాడీ కలదు. అయితే, తేలికపాటి బరువును కలిగి ఉండటం దీని ప్రత్యేకత.

హోండా గ్రాజియా 125

హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో అల్లాయ్ వీల్స్, నూతన కాంబి బ్రేక్ సిస్టమ్ గల ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు డ్యూయల్ పెయింట్ స్కీమ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో రానున్నాయి.

హోండా గ్రాజియా 125

స్కూటర్ ఫ్లోర్ బోర్డ్ దగ్గర చిన్నపాటి స్టోరేజి స్పేస్ కూడా కలదు. రైడింగ్‌లో ఉన్నపుడు ఫోన్లను ఛార్జ్ చేసుకోవడానికి యుఎస్‍‌బి సాకెట్ పోర్ట్ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది.

హోండా గ్రాజియా 125

హోండా గ్రాజియా 125 స్కూటర్ మీద అఫీషియల్ బుకింగ్స్ రూ. 2,000 ల బుకింగ్ అమౌంట్‌తో అక్టోబర్ 25 నుండి ప్రారంభం కానున్నాయి. స్కూటర్లు ఇప్పటికే డీలర్ల వద్దకు చేరుతున్నాయి. కాబట్టి నవంబరు తొలి వారంలో డెలివరీలు మొదలయ్యే అవకాశం ఉంది.

Trending On DriveSpark Telugu:

హోండా గ్రాజియా 125

సాంకేతికంగా హోండా గ్రాజియా 125 స్కూటర్‌లో ఆక్టివాలో 125లో ఉన్న గాలితో చల్లబడే 125సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ వద్ద 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా గ్రాజియా 125

హోండా తమ గ్రాజియా 125 స్కూటర్‌ను పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తే, మార్కెట్లో ఉన్న వెస్పా విఎక్స్125, సుజుకి యాక్సెస్ 125, మరియు మహీంగ్రా గస్టో 125 స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా గ్రాజియా 125

ఇటాలియన్ స్కూటర్ల తయారీ సంస్థ అప్రిలియా కూడా అతి త్వరలో 125సీసీ స్కూటర్‌ను లాంచ్ చేయనుంది. ప్రస్తుతానికి గ్రాజియా 125 స్కూటర్ రూ. 65,000 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 24, 2017, 10:20 [IST]
English summary
Read In Telugu: Honda Grazia premium 125cc automatic scooter coming soon to India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+