విడుదలైన మూడు వారాల్లోపే అదరగొట్టిన హోండా గ్రాజియా

Written By:

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన గ్రాజియా స్కూటర్ భారీ సక్సెస్ అందుకుంది. విడుదలైన మూడు వారాల అనంతరం గ్రాజియా సేల్స్ ఫలితాలను వెల్లడించింది.

హోండా గ్రాజియా

దేశవ్యాప్తంగా నవంబరులో విడుదలైన హోండా గ్రాజియా స్కూటర్‌కు మంచి ఆదరణ లభించింది. కేవలం మూడు వారాల్లోపే 15,000 యూనిట్ల గ్రాజియా స్కూటర్లు అమ్ముడయ్యాయి.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా తొలి మైలురాయిని అందుకుంది. ఈ సందర్భంగా హోండా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ మాట్లాడుతూ, ఫ్రెష్ డిజైన్, స్టైల్, పర్ఫామెన్స్ మరియు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు ఉండటంతో మంచి సక్సెస్ అందుకుందని చెప్పుకొచ్చాడు.

హోండా గ్రాజియా

పూర్తి స్థాయి ఎల్ఇడి హెడ్ ల్యాంప్, అత్యుత్తమ మైలేజ్ కోసం ఎకో స్పీడ్ ఇండికేటర్, సీటు ఓపెనర్‌తో పాటు 4 ఇన్ 1 లాక్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు యుటిలి ఫ్రంట్ పాకెట్ మరియు ఆప్షనల్‌ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా గ్రాజియా

అతి తక్కువ కాలంలోనే గ్రాజియా మీద మంచి రెస్పాన్స్ లభిస్తోంది. భవిష్యత్తులో స్కూటర్ల విభాగం విస్తరింపజేయడంలో గ్రాజియా కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. స్కూటర్ల విపణిలో అగ్రగామిగా ఉన్న హోండాను అదే స్థానంలో నిలిపేందుకు తోడ్పడుతుందని యడ్విందర్ సింగ్ తెలిపాడు.

హోండా గ్రాజియా

హోండా గ్రాజియా స్కూటర్‌లో 125సీసీ కెపాసిటి గల హెచ్‌ఇటి ఇంజన్ కలదు. ఆరు విభిన్న రంగుల్లో లభించే గ్రాజియా ప్రారంభ ధర రూ. 57,897 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హోండా గ్రాజియా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాంకేతికంగా హోండా గ్రాజియా అత్యంత అడ్వాన్స్‌డ్ స్కూటర్. గేర్లు రహిత ద్విచక్ర వాహన పరిశ్రమలో హోండా సరికొత్త రికార్డులను హోండా నెలకొల్పుతోంది. డిజైన్, స్టైల్ మరియు ఫీచర్ల పరంగా యువ కొనుగోలుదారులను మరియు సిటీ కస్టమర్లకు హోండా గ్రాజియా మరింత చేరువ కానుంది.

Read more on: #honda #హోండా
English summary
Read In Telugu: Honda Grazia Receives An Overwhelming Response — Find Out Why!
Story first published: Friday, December 1, 2017, 12:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark