గ్రాజియా Vs ఆక్టివా 125: ధర, ఇంజన్, ఫీచర్ల పరంగా ఏది బెస్ట్ సెలక్షన్

హోండా తాజాగా ప్రీమియమ్,అర్బన్ మరియు స్పోర్టివ్ స్కూటర్‌ గ్రాజియా ను విడుదల చేసింది. సిటీ మరియు యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ హోండా ఈ సరికొత్త గ్రాజియా స్కూటర్‌ను పరిచయం చేసింది.

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి తాజాగా ప్రీమియమ్,అర్బన్ మరియు స్పోర్టివ్ స్కూటర్‌ గ్రాజియా ను విడుదల చేసింది. సిటీ మరియు యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ హోండా ఈ సరికొత్త గ్రాజియా స్కూటర్‌ను పరిచయం చేసింది.

హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

దేశీయంగా 125సీసీ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది. 100సీసీ మరియు 110సీసీ పోల్చుకుంటే 125సీసీ ఇంజన్ గల స్కూటర్ల సేల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో జపాన్ దిగ్గజం హోండా టూ వీలర్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆక్టివా సిరీస్ స్కూటర్లతో భారీ సేల్స్ సాధిస్తోంది.

Recommended Video

[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

దేశవ్యాప్తంగా సిటీ, అర్బన్ మరియు రూరల్ ఏరియాల్లో హోండా ఆక్టివా స్కూటర్‌కు మంచి ఆదరణ లభించింది. అయితే, ఇప్పుడు సిటీలోని యువ కొనుగోలుదారులే లక్ష్యంగా ఆక్టివా ఆధారిత స్పోర్టివ్ స్కూటర్ 125 ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

ఒకే ఇంజన్, విభిన్న ఫీచర్లు మరియు విభిన్న డిజైన్‌లో ఉన్న గ్రాజియా మరియు ఆక్టివా స్కూటర్‌లలో ఏది బెస్ట్ ? ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి.

హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

హోండా గ్రాజియా డిజైన్

గ్రాజియా డిజైన్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఇండియన్ స్కూటర్ హిస్టరీలో పరిచయం కాని సరికొత్త అప్ మార్కెట్ డిజైన్‌ను కలిగి ఉంది. మిగతా స్కూటర్లతో పోల్చుకుంటే ప్రీమియమ్ లుక్ దీని సొంతం. హోండా గ్రాజియా ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ మరియు దానికి పై వైపున రెండు ఎల్ఇడి టర్న్ ఇండికేటర్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

ఫ్రంట్ డిజైన్ మాత్రమే కాదు, ఫుల్లీ డిజిటల్ డిస్ల్పే గల సరికొత్త ఇంస్ట్రుమెంట్ కన్సోల్, విభిన్న ఇంటీరియర్ ప్యానెల్‌లో స్టోరేజ్ స్పేస్ మరియు అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

హోండా ఆక్టివా 125 డిజైన్

గ్రాజియాతో పోల్చుకుంటే ఆక్టివా 125 ఫ్రంట్ డిజైన్ చాలా ఫార్మల్‌గా ఉంటుంది. ఫ్రంట్ మరియు సైడ్ డిజైన్‌లో మృదువుగా ఆకర్షణీయమైన క్యారెక్టర్ లైన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అయితే, విశాలమైన ఫ్రంట్ డిజైన్, క్రోమ్ ప్యానల్, అల్లాయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేకుల గల ఆక్టివా 125భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌గా నిలిచింది.

హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

హోండా గ్రాజియా మరియు హోండా ఆక్టివా 125 లను పోల్చితే, డిజైన్ మరియు స్టైలిష్ పరంగా గ్రాజియా బెటర్ ఛాయిస్, అయితే భారతీయులు ఎక్కువగా ఎంచుకున్న, బాగా విశ్వసించదగ్గ స్కూటర్‌గా ఆక్టివా 125 నిరూపించుకుంది.

డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్

  • హోండా గ్రాజియా 8/10
  • హోండా ఆక్టివా 125 7.5/10
  • హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

    హోండా గ్రాజియా ఫీచర్లు

    హోండా గ్రాజియా స్కూటర్లో ఇప్పటి వరకు స్కూటర్ల పరిశ్రమలో పరిచయం కాని ఫస్ట్ క్లాస్ ఫీచర్లను పరిచయం చేసింది. ఎల్ఇడి హెడ్ లైట్, ఫ్రంట్ గ్లూవ్ బాక్స్, మొబైల్ ఛార్జర్ పోర్ట్, ఫుల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

    హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

    హోండా ఆక్టివా 125లో అధునాతన ఫీచర్లు లేకపోయినప్పటికీ, సౌకర్యవంతమైన రైడింగ్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్(ఆప్షనల్), సెమి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఇడి పైలట్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

    ఫీచర్ల పరంగా హోండా గ్రాజియా స్కూటర్ ఆక్టివాను ఖచ్చితంగా ప్రక్కకు నెట్టేస్తుంది. అయితే ఈ రెండింటి మద్య పోటీ ఇతర స్కూటర్లకు అవకాశంగా మారకుండా రెండు స్కూటర్లలో కూడా కామన్ ఫీచర్స్ అంందించి స్కూటర్ ప్రేమికులకు హోండా మరింత చేరువవుతోంది.

    ఫీచర్ల పరంగా ఓవరాల్ రేటింగ్

    • హోండా గ్రాజియా 8/10
    • హోండా ఆక్టివా 125 7.5/10
    • హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

      ఇంజన్ స్పేసిఫికేషన్స్ మరియు ట్రాన్స్‌మిషన్

      ఇంజన్ విషయానికి వస్తే, గ్రాజియా మరియు ఆక్టివా 125 రెడింటిలో కూడా 125 ఇంజన్ కలదు. ఇందులో 124.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ట్రాన్స్‌మిషన్ గల ఇది 8.52బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

      హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

      రెండు స్కూటర్లలో ఒకే ఇంజన్ ఉండటంతో రైడింగ్, హ్యాండ్లింగ్ మరియు పవర్ అవుట్ అంశాలలో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. అయితే, వివిధ రైడింగ్ కండీషన్‌లను బట్టి మైలేజ్‌లో తేడా కనిపించే అవకాశం ఉంది.

      ఇంజన్ పరంగా ఓవరాల్ రేటింగ్

      • హోండా గ్రాజియా 8/10
      • హోండా ఆక్టివా 125 8/10
      • హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

        ధర

        ప్రతి ఒక్కరు తప్పకుండా పరిశీలించే అంశం ధర. హోండా గ్రాజియా మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్లు మరియు వాటి ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.

        • గ్రాజియా ఎస్‌టిడి ధర రూ. 57,897 లు
        • గ్రాజియా అల్లాయ్ ధర రూ. 59,827 లు
        • గ్రాజియా డిఎల్ఎక్స్ ధర రూ. 62,269 లు
        • హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

          ఆక్టివా 125 ధరలు

          హోండా ఆక్టివా 125 ధరల శ్రేణి రూ. 57,497 ల నుండి 61,869 ల మధ్య ఉంది. ధర విషయంలో గ్రాజియా మరియు ఆక్టివా మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. అయితే, గ్రాజియాలోని అధునాతన డిజైన్, ఫీచర్లు ఆక్టివా 125 ను వెనక్కి నెట్టేసింది.

          హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

          తీర్పు

          అన్ని అంశాల పరంగా ఆక్టివాతో పోల్చుకుంటే హోండా గ్రాజియా చాలా బెటర్. హోండా ఆక్టివా 125 సింపుల్‌గా కనబడే పొందికైన స్కూటర్. అయితే, చాలా ఫీచర్లను మిస్సయ్యింది.

          హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

          డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

          హోండా పేర్కొన్నట్లుగానే సిటీలోని యువ కొనుగోలుదారులను లక్ష్యంగా అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సిటి రైడర్లకు అవసరమయ్యే ఫీచర్లను మరియు సిటీ రోడ్లకు అనుగుణంగా ప్రీమియమ్ లుక్ గ్రాజియా సొంతం.

          హోండా గ్రాజియా Vs హోండా ఆక్టివా 125

          ఆక్టివా 125 స్కూటర్ సిటి మరియు అర్బన్ రైడర్లు, అన్ని రకాల వయస్సున్న వారు ఎంచుకోవచ్చు. ఇందులో అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉడంటంతో అన్ని రకాల రహదారుల సూట్ ఇవ్వడం దీని మరో ప్రత్యేకత.

          ఈ రెండింటిలో మీకు ఏ స్కూటర్ నచ్చిందో... క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Read In Telugu: Honda Grazia Vs. Honda Activa 125 Comparison On Specifications, Features & Price
Story first published: Saturday, November 11, 2017, 15:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X