హిస్టారికల్ మంకీ బైకుకు శాస్వత వీడ్కోలు పలికిన హోండా

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అతి త్వరతో తమ చారిత్రక టూ వీలర్ మంకీ బైకు ఫేర్‌వెల్ నిర్వహించనుంది. సుమారుగా 50 సంవత్సరాలు పాటు జపాన్‌లో విక్రయించబడిన మంకీ బైకు ప్రొడక్షన్‌కు శాస్వత ముగింపు పలకడానికి హోండా సిద్దమైంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా మంకీ బైకు

హోండా తమ మంకీ బైక్ ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్లు గత ఏడాది చివర్లలో అధికారికంగా ప్రకటించింది. ఆశించిన మేర డిమాండ్ లేకపోవడంతో మంకీ బైకు విక్రయాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా మంకీ బైకు

అయితే, చివరగా 500 మంకీ బైకులను మాత్రమే అభిమానుల కోసం ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం నిర్వహించిన కాంటెస్టులో గెలవడానికి సుమారుగా 45,333 మంది ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు హోండా టూ వీలర్స్ వెల్లడించింది.

హోండా మంకీ బైకు

టూ వీలర్ల విభాగంలో పోటీ ఎరుగని కాలంలో హోండా తమ మంకీ బైకును ప్రవేశపెట్టింది. తొలుత టోక్యో లోని పార్కుల్లో రైడింగ్ కోసం 1961 కాలంలో హోండా తమ మంకీ బైకులను ఉత్పత్తి చేసింది.

హోండా మంకీ బైకు

అయితే రోడ్ లీగల్ అనుమతులు పూర్తి స్థాయిలో లభించాక 1967లో మంకీ బైకు ప్రొడక్షన్ ప్రారంభమైంది. అప్పట్లో హోండా మంకీ బైకులో 50సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ ఉండేది.

హోండా మంకీ బైకు

హోండా మంకీ విడుదలైన అనతి కాలంలో విపరీతమైన డిమాండ్ లభించింది. నిజానికి అప్పట్లో లభించే బైకులన్నీ పెద్ద పెద్ద పరిమాణంలో ఉండేవి. అయితే మంకీ బైకులు చిన్న పరిమాణంలో కాంపాక్ట్ డిజైన్‌లో ఉండటంతో సులభమైన రైడింగ్ మరియు సిటి అవసరాలకు అనుగుణంగా ఉండటంతో బాగా సక్సెస్ సాధించింది.

హోండా మంకీ బైకు

ఫోల్డబుల్ హ్యాండిల్ బార్స్ ఇందులో ప్రత్యేకమైన ఫీచర్. కాంపాక్ట్ డిజైన్ ఆధారంగా త్వరలో హోండా టూ వీలర్స్ విభిన్నమైన ఉత్పత్తులను అభివృద్ది చేసి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

హోండా మంకీ బైకు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వివేకవంతమైన డిజైన్ మరియు ప్రతి వినియోగదారుడుని ఆకట్టుకునే శైలిలో ఉండటం హోండా మంకీ బైకుకు బాగా కలిసొచ్చింది. ఏదేమైనప్పటికీ మంకీ మరియు మంకీ స్టైల్ ఆధారిత టూ వీలర్లను హోండా ఇండియన్ మార్కెట్లోకి పరిచయం చేయడం లేదు. అయితే ఇలాంటి డిజైన్ లక్షణాలున్న బైకు కావాలంటే హోండా ఇండియా లైనప్‌లో ఉన్న నవీ టూ వీలర్‌ను ఎంచుకోగలరు.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: Honda Monkey Bike Production Stops
Story first published: Wednesday, August 30, 2017, 18:03 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark