హోండా నుండి అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్ నవీ

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇండియన్ మార్కెట్లోకి తమ నవీ స్కూటర్‌ను నవీ అడ్వెంచర్ మరియు నవీ క్రోమ్ ఎడిషన్ లలో విడుదల చేయనుంది.

By Anil

హోండా నవీ యొక్క్ అప్‌డేటెడ్ ఎడిషన్ కోసం ఎదురు చూసే వారి కోసం 2017 ఏడాది ఒక గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. జపనీస్‌కు చెందిన టూ వీలర్ల తయారీ సంస్థ హోండా తమ నవీ స్కూటర్‌ను అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్ లలో విడుదల చేస్తున్నామని తెలియజేయడానికి "హ్యాపీ నవీ ఇయర్" అంటూ విషెష్ తెలిపి మరీ సూచనలిచ్చింది.

హోండా నవీ

సాధారణ నవీ స్కూటర్ల కన్న ప్రత్యేకంగా ఉండేందుకు ఈ రెండు మోడళ్లలో పొడవాటి విండ్ స్క్రీన్ మరియు లివర్ గార్డులను అందించింది. మునుపటి నవీలో ఈ రెండింటిని గుర్తించలేము.

హోండా నవీ

అడ్వెంచర్ అని తెలియచేయడానికి ఎక్ట్సీరియర్ మీద ఉన్న బాడీ కలర్ అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న స్కూటర్లకు గట్టిగా తలపడే రీతిలో దీని డ్యూయల్ టోన్ బాడీ పెయింటింగ్ ఉందని చెప్పాలి.

హోండా నవీ

హోండా నవీ సిరీస్‌లో క్రోమ్ ఎడిషన్ మరో మోడల్. హోండా టూ వీలర్స్, దీనిని ఈ ఏడాదిలో మార్కెట్లోకి చేసే అవకాశం ఉంది. క్రోమ్ ఎడిషన్ అని గుర్తించేందుకు కాబోలు దీని బాడీ పెయింటింగ్‌ను మిగతా వాటికన్నా విభిన్నంగా అందించారు.

హోండా నవీ

పైన తెలిపిన చిన్న చిన్న మార్పులు మినహాయిస్తే ఇందులో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదని హోండా తెలిపింది. అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌లలో సస్పెన్షన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు మునుపటి నవీ లోని సస్పెన్షన్‌ సిస్టమ్‌నే ఇందులో పరిచయం చేయడం జరిగింది.

హోండా నవీ

సాంకేతికంగా నవీ అడ్వెంచర్ మరియు నవీ క్రోమ్ ఎడిషన్ లలో 110సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఆక్టివా కూడా ఇదే పవర్ ఉత్పత్తి చేయును.

హోండా నవీ

హోండా టూ వీలర్స్ మొదటి సారిగా నవీ స్కూటర్‌ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ఇదే వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్ నవీ మోడళ్లను కూడా విడుదల చేసింది.

హోండా నవీ

ఈ స్పెషల్ ఎడిషన్‌లలో ఇంధన ట్యాంకు క్రింద భాగంలో స్టోరేజ్ బాక్స్‌లను అందించి మరీ పరిచయం చేసింది. ఈ స్టోరేజి బాక్స్‌లను హోండా ఇప్పుడు నవీ ఓనర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

హోండా నవీ
  • నూతన ఆశలతో సరికొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే: హోండా నవీ రివ్యూ
  • .

    జనవరి 3, 2016 న విడుదల కానున్న టాటా జెనాన్ యోధా

    టాటా మోటార్స్ నూతన ఏడాది వేదికగా తమ మొదటి ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. 2017 జనవరి లోని మొదటి వారంలో జెనాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల చేయడానికి అన్ని విధాలుగా సమాయత్తమౌతోంది.

More from DriveSpark

Article Published On: Monday, January 2, 2017, 12:12 [IST]
English summary
Honda Navi Adventure And Chrome Edition To Be Available In India Soon
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+