జి310 జిఎస్ మరియు కెటిఎమ్ 390 లకు పోటీగా హోండా డామినేటర్

దేశీయ విపణిలో ఉన్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి తమ డామినేటర్ మోటార్ సైకిలను రీ లాంచ్ చేయడానికి హోండా టూ వీలర్స్ సిద్దం అవుతున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

By Anil

ఇది హోండా కు చెందిన అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ అని రూపం, ఆకృతి చూడగానే ఇట్టే చెప్పగలం.... ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడింగ్ సామర్థ్యం ఉన్న ఈ డామినేటర్ బైకును బిఎమ్‌డబ్ల్యూ జి310జిఎస్ మరియు కెటిఎమ్ 390 అడ్వెంచర్‌లకు పోటీగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది దేశీయంగా విడుదలయితే ఇప్పటికే భారీ వేడి మీద ఉన్న ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీ తారా స్థాయికి చేరే అవకాశం ఉంది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

అడ్వెంచర్ మోటార్ సైకిళ్లుప్రస్తుతానికి కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ 2017 ఏడాది చివరి నాటికి ఈ సెగ్మెంట్లో పోటీ మరింత తీవ్రం కానుంది. అందుకు బిఎమ్‌డబ్ల్యూ దిగ్గజం అభివృద్ది చేస్తున్న జి310జిఎస్ ఒకటి.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

గతంలో ఉన్న మోడళ్లకు ఇండియాలో మంచి స్పందన లభిస్తుండటంతో డామినేటర్ రీలాంచ్‌పై హోండా ఆసక్తి కనబరుస్తోంది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ గత ఏడాది జరిగిన 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద జి310 జిఎస్ ను ప్రదర్శించింది. ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ జి 310 ఆర్ ఆధారంగా రూపొందించింది. దీనికి తోడుగా, కవాసకి వెర్సేస్ ఎక్స్300 మరియు సుజుకి కూడా తమ డిఎల్250 కాన్సెప్ట్‌ను అదే వేదిక మీద ప్రదర్శించింది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

అయితే మోటార్ బైక్స్ అనే వేదిక ప్రకటించిన కథనం మేరకు, హోండా ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంచిన డామినేటర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను మళ్లీ విడుదల చేయడానికి కంకణ కట్టుకున్నట్లు తెలిపింది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

1988 నుండి 2000 మధ్య కాలంలో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైకుగా పేరుగాంచింది. అప్పట్లో విక్రయాల పరంగా మంచి ఫలితాలను సాధించేది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

హోండా మోటార్ సైకిల్స్ సంస్థ డామినేటర్ ఆధారిత నూతన అడ్వెంచర్ మోటార్ సైకిల్‌కు సంభందించిన పేటెంట్ పొందిన చిత్రాన్ని విడుదల చేసింది, ఇందులో కొన్ని కొత్త ఫీచర్లు వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

డామినేటర్ అడ్వెంచర్ బైకులో హ్యాండిల్ బార్‌కు ఎడమ వైపున కొన్ని కంట్రోల్ బటన్స్ కలవు. రైడింగ్ సమయంలో విభిన్న మోడ్‌లను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కూడా తెలిసింది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

ఫోటోని గమనించగానే, ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ అవసరాలకు ఉపయోపడే మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు. ఇందులో పొడవాటి సీటు, ఎక్కువ పరిమాణంలో ఉన్న మడ్ గార్డ్, రీలాక్స్ రైడింగ్ పొజిషన్ మరియు పొడగించబడిన లగేజ్ కిట్లను గుర్తించ్చు.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అసలైన డామినేటర్ తొలిసారిగా 1988 లో విడుదలయ్యింది. అప్పట్లో ఇందులో 643సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఉండేది. ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

తాజాగా హోండా బాస్ కోహి సుగితా 250సీసీ సామర్థ్యం ఉన్న క్రాస్‌రన్నర్ విడుదలకు మార్గం సుగమం చేసుకుంటోందని హింట్ ఇచ్చారు. కాబట్టి డామినర్ 250సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో ఎంట్రీలెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో పోటీకి సిద్దం అవుతోంది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్

ఇది మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కెటిఎమ్ 390 అడ్వెంచర్ మరియు త్వరలో విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ జి 310 జిఎస్ లకు గట్టి పోటీనివ్వనుంది.

హోండా డామినేటర్ అడ్వెంచర్ బైక్
  • హీరో నుండి రూ. 19,990 లకే ఎలక్ట్రిక్ స్కూటర్
  • ఎక్స్ఎస్ఆర్300 పేరుతో మళ్లీ విడుదలకు సిద్దమవుతున్న ఆర్‌డి350
  • హైదరాబాద్ పోలీసులకు రీగల్ రాప్టర్ మోటార్ సైకిళ్లు

More from DriveSpark

Article Published On: Friday, February 3, 2017, 15:29 [IST]
English summary
Honda Is Bringing Back The Dominator — A Rival For BMW G 310 GS And KTM 390 Adventure
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+