ఒక్క రోజులో లక్ష టూ వీలర్లను విక్రయించిన హోండా

Written By:

హోండా టూ వీలర్స్ ఇండియా చరిత్రలోని అన్ని సేల్స్ రికార్డులను తిరిగి రాసింది. ఒక్క రోజులో లక్ష టూ వీలర్లను విక్రయించి అరుదైన మైలురాయిని సాధించింది. జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా దసరా పండుగ రోజు మాత్రమే లక్ష టూ వీలర్లను విక్రయించి రికార్డు నెలకొల్పింది.

హోండా టూ వీలర్ల సేల్స్

హోండా ఇండియాలో గడిచిన ఆగష్టు 2017 లో అత్యధిక విక్రయాలు జరిపింది. ఒక్క ఆగష్టులోనే 6 లక్షల బైకులు మరియు స్కూటర్లను విక్రయించింది. వరుసగా ఆగష్ట్ మరియు సెప్టెంబర్ మాసాల్లో ఆరు లక్షల యూనిట్ల చెప్పున రెండు నెలలో 10 లక్షల టూవీలర్లకు పైగా విక్రయించింది. ఇది హోండా ఆల్ టైమ్ రికార్డ్ సేల్స్ కావడం గమనార్హం.

హోండా టూ వీలర్ల సేల్స్

దసరా నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజే 52,000 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయి. అయితే, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో డిమాండ్ పెరగడంతో దసరా పండుగ రోజున విక్రయాలు 50 శాతం పెరిగాయి.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా టూ వీలర్ల సేల్స్

గత ఏడాది సెప్టెంబర్ 2016 లో హోండా విక్రయించిన 5,68,753 యూనిట్లతో పోల్చుకుంటే ఈ యేడు అదే నెలలో 6,01,998 యూనిట్లను విక్రయించింది. వీటిలో 5,69,888 టూ వీలర్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించగా... 32,110 టూ వీలర్లను ఎగుమతి చేసింది.

హోండా టూ వీలర్ల సేల్స్

తొలిసారిగా, హోండా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్లో ఆరు నెలల్లో 30 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపింది. అధిక డిమాండుతో ఎక్కువ యూనిట్లను విక్రయించే మరియు అధిక మార్కెట్ వాటాను సొంతం చేసుకున్న కంపెనీగా హోండా టూ వీలర్స్ ఇండియా నిలిచింది.

హోండా టూ వీలర్ల సేల్స్

రికార్డ్ స్థాయి సేల్స్ గురించి హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ," భారత్‌లో పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి హోండా టూ వీలర్ల విక్రయాలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ పండుగల సందర్భంగా కస్టమర్లు హోండా టూ వీలర్లను ఎంచుకుంటున్నట్లు తెలిపాడు. వినాయక చవితి, ఓనమ్ మరియు నవరాత్రి పర్వదినాలలో సేల్స్ 50 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పుకొచ్చాడు."

హోండా టూ వీలర్ల సేల్స్

దసరా పర్వదినాన ఒక్క రోజులేనే లక్ష యూనిట్ల టూ వీలర్ల సేల్స్ గురించి స్పందిస్తూ, దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ రానుండటంతో విక్రయాలు ఇంకా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. పండుగ సీజన్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్షన్ చేస్తున్నట్లు తెలిపాడు.

హోండా టూ వీలర్ల సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ మధ్య కాలంలో జపాన్ దిగ్గజం హోండా టూ వీలర్స్ ఇండియా భారీ వృద్దిని సాధిస్తోంది. దేశవ్యాప్తంగా విసృతమైన డీలర్‌షిప్, సేల్స్ మరియు సర్వీస్ నెట్‌వర్క్ కలిగి ఉండటంతో పాటు అన్ని రకాల కస్టమర్లకు అనుగుణంగా తాజా ఉత్పత్తులను విడుదల చేస్తూ ఇండియన్ కస్టమర్లను తెలివిగా ఆకట్టుకుంటోంది.

హోండా టూ వీలర్స్ స్కూటర్ల సెగ్మెంట్లో ఆక్టివా సిరీస్, డియో స్కూటర్లను మరియు బైకుల సెగ్మెంట్లో హార్నెట్, యూనికార్న్ మరియు షైన్ వంటి బైకులను ఎక్కువగా విక్రయిస్తోంది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: Honda Two-Wheelers Records One Lakh Sales On A Single Day
Story first published: Thursday, October 5, 2017, 14:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark