భారతదేశపు తొలి వెర్సేస్ ఎక్స్ 300 డెలివరీ ఇచ్చిన కవాసకి

Written By:

దిగ్గజ సూపర్ బైకుల తయారీ దిగ్గజం కవాసకి భారతదేశపు తొలి కవాసకి వెర్సేస్ ఎక్స్-300 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను కస్టమర్‌కు డెలివరీ ఇచ్చింది. జపాన్ దిగ్గజం అభివృద్ది చేసిన ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్‌ను అందుకొని తొలి వెర్సేస్ ఎక్స్-300 కస్టమర్‌గా నిలిచాడు.

కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

కవాసకి తమ వెర్సేస్ ఎక్స్-300 అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్‌ను రూ. 4.6 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో నవంబరు 2017 లాంచ్ చేసింది.

Recommended Video - Watch Now!
EICMA 2017: Kawasaki Ninja H2 SX And SX SE Revealed
కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

ఈ బైకులో ఇరువైపులా 17-అంగుళాల పరిమాణం గల స్పోక్ వీల్స్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్‌తో పోల్చుకుంటే ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ రూట్లలో స్పోక్ వీల్స్ అత్యుత్తమ ధృడత్వాన్ని కల్పిస్తాయి.

కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

కవాసకి వెర్సేస్ ఎక్స్-300 అడ్వెంచర్ బైకులో 296సీసీ కెపాసిటి గల ట్విన్ ప్యార్లల్ ఇంజన్‌ కలదు, ఇదే ఇంజన్ కవాసకి నింజా 300లో కూడా ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన గరిష్టంగా 38బిహెచ్‌పి పవర్ మరియు 25.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

కవాసకి ఈ 296సీసీ ట్విన్ ప్యార్లల్ ఇంజన్‌ను ప్రత్యేకించి వెర్సేస్ ఎక్స్-300 కోసం ట్యూన్ చేసినట్లు పేర్కొంది. దీంతో అన్ని రహదారుల మీద తక్కువ ఇంజన్ వేగం వద్ద అత్యుత్తమ పవర్, టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

కవాసకి వెర్సేస్ ఎక్స్-300 బైకులో ఒత్తిడి లేని రైడింగ్ కోసం స్లిప్పర్ క్లచ్ అసిస్ట్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మరియు ఇంజన్‌ వేడిని తగ్గించేందుకు అధిక మొత్తంలో ఇంజన్‌కు గాలి ప్రవాహం ఉండేలా డిజైన్ చేసింది.

కవాసకి వెర్సేస్ ఎక్స్ 300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి వెర్సేస్ అద్భుతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్. ప్రస్తుతం దీనిని పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకుని విక్రయిస్తోంది. 4.6 లక్షల ధరకు కవాసకి వెర్సేస్ ఎక్స్-300 బెస్ట్ ప్యాకేజ్ అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Inda’s First Kawasaki Versys X-300 Adventure Motorcycle Delivered In Pune
Story first published: Sunday, December 24, 2017, 9:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark