కవాసకి నుంచి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

Written By:

కవాసకి ఎస్ట్రెల్లా 175 అనే రెట్రో స్టైల్ బైకును విడుదల చేయనుంది. కవాసకి మోటార్ సైకిల్స్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నింజా సిరీస్ బైకులు. స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థగా పేరుగాంచిన కవాసకి ఇప్పుడు రెట్రో స్టైల్ మోటార్ సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

తాజాగా అందుతున్న రిపోర్ట్స్ మేరకు, కవాసకి ఎస్ట్రెల్లా 175 పేరుతో సరికొత్త రెట్రో స్టైల్ బైకును ఈ ఏడాది ముగిసేలోపు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. గతంలో కవాసకి ఎస్ట్రెల్లా 175 బైకును అభివృద్ది చేస్తున్నట్లు పలు కథనాలు వచ్చాయి.

కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

కవాసకి తమ ఈ ఎస్ట్రెల్లా 175 రెట్రో బైకును తొలుత ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల చేసి, తరువాత ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. స్టాండర్డ్ మరియు స్పెషల్ ఎడిషన్ అనే రెండు విభిన్న వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Recommended Video - Watch Now!
Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

చూడటానికి అచ్చం ట్రంయప్ బొన్‌ల్ బైకును పోలి ఉన్నప్పటికీ, కవాసకి ఇది వరకే అభివృద్ది చేసిన ఎస్ట్రెల్లా 250 ఆధారంగా ఎస్ట్రెల్లా 175 ను డెవలప్ చేసింది. ఇందులో క్లాసిక్ ఎగ్జాస్ట్ పైపు, గుండ్రటి హెడ్ ల్యాంప్, స్పోక్ వీల్స్, పొడవాటి సింగల్ పీస్ సీటు మరియు క్రోమ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

కవాసకి రెట్రో స్టైల్‌ మోటార్ సైకిల్ ఎస్ట్రెల్లా 175లో 175సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. అయితే ఇది ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వివరాలు కవాసకి వెల్లడించలేదు. అయితే, ఎస్ట్రెల్లా 250 బైకు 17బిహెచ్‌పి పవర్ మరియు 18ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

కవాసకి ఎస్ట్రెల్లా 175 లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటి కోసం ఫ్రంట్ వీల్‌కు డిస్క్, రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేకులను అమర్చారు. అయితే, ఇది ఏబిఎస్ ఫీచర్‌తో వచ్చే అవకాశాలు లేనట్లుగా ఉన్నాయి.

కవాసకి ఎస్ట్రెల్లా 175 రెట్రో స్టైల్ మోటార్ సైకిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కవాసకి ఎస్ట్రెలా 250 శైలిలోనే ఎస్ట్రెలా 175 బైకును రూపొందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఎస్ట్రెల్లా 250 ఇప్పటికీ దేశీయంగా విడుదల కాలేదు. మరియు ఎస్ట్రెల్లా 175 ఇండియా విడుదల గురించి కవాసకి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ కవాసకి ఎస్ట్రెల్లా 250 బైకును విడుదల చేస్తే రాయల్ ఎన్పీల్డ్ బుల్లెట్ 350 మరియు క్లాసిక్ 350 బైకులకు పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Kawasaki To Launch Retro-Style Estrella 175
Story first published: Wednesday, September 20, 2017, 14:51 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark