కవాసకి నింజా 1000 విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

కవాసకి తమ 2017 నింజా 1000 మోటార్ సైకిల్‌ను నేడు(07/07/17) విపణిలోకి విడుదల చేసింది. స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్లో విడుదలైన దీని ప్రారంభ ధర రూ. 9.98 లక్షలు ఎక్స్-షోరూమ్‌(దేశ వ్యాప్తంగా)గా ఉంది.

కవాసకి నింజా 1000 విడుదల

కవాసకి నింజా 1000 బైకులో 1043సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ఇన్ లైన్ ఇంజన్ కలదు, ఇది 10,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 140బిహెచ్‌పి పవర్ మరియు 7,300ఆర్‌ఎమ్ వద్ద గరిష్టంగా 111ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌కు అనుసంధానం చేసిన 6-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి అందుతుంది.

కవాసకి నింజా 1000 విడుదల

2016 కవాసకి నింజా 1000 బైకుతో పోల్చితే, సరికొత్త 2017 నింజా 1000 బైకులో రివైజ్ చేయబడిన ఇసియు సెట్టింగ్స్ అందివ్వడం జరిగింది. దీంతో నూతన బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించడమే కాకుండా ఇంజన్ నుండి పవర్ స్మూత్‌గా డెలివరీ అవుతుంది. అదనపు వైబ్రేషన్లను నివారించడానికి ఇంజన్‌లోని క్రాంక్ షాఫ్ట్‌కు అదనపు బరువులను జోడించారు.

కవాసకి నింజా 1000 విడుదల

2017 కవాసకి నింజా 1000 బైకులో 6-యాక్సిస్ బాష్ ఐఎమ్‌యు వ్యవస్థ కలదు, ఈ వ్యవస్థలో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, వీలి కంట్రోల్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

కవాసకి నింజా 1000 విడుదల

కవాసకి ఇందులో రివైజ్ చేయబడిన షాక్ అబ్జార్వర్లు మరియు లింకేజ్ రేషియో లను రివైజ్ చేయడంతో రైడింగ్ సౌకర్యం పెరిగి, కుషనింగ్ పెరిగింది. లింకేజ్ రేషియోలో మార్పులు రావడంతో సీటు ఎత్తు 5ఎమ్ఎమ్ వరకు తగ్గింది. గ్రౌండ్ నుండి సీట్ ఎత్తు 815ఎమ్ఎమ్‌గా ఉంది.

కవాసకి నింజా 1000 విడుదల

2017 కవాసకి నింజా 1000 ఫ్రంట్ డిజైన్‌లో డ్యూయల్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. రెండు యూనిట్లలో కూడా హై భీమ్ మరియు లో భీమ్ ఫీచర్ కలదు, మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే 50 శాతం తక్కువ పవర్‌తో ఎక్కువ కాంతిని వెదజల్లే హెడ్ ల్యాంప్ క్లస్టర్ కలదు.

కవాసకి నింజా 1000 విడుదల

సరికొత్త ఇంస్ట్రుమెంట్ ప్యానల్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న అనలాగ్ టాకో మీటర్ కలదు. ఇందులో భాగంగానే మల్టీ ఫంక్షన్ ఎల్‌సిడి స్క్రీన్ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ కలదు.

కవాసకి నింజా 1000 విడుదల

2017 కవాసకి నింజా 1000 ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న సుజుకి జిఎస్ఎక్స్-ఎస్1000ఎఫ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200ఆర్ఎస్ లకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: 2017 Kawasaki Ninja 1000 Launched In India; Priced At Rs 9.98 Lakh.
Story first published: Friday, July 7, 2017, 15:21 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark