కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్ విడుదల: ధర రూ. 5.69 లక్షలు

Written By:

జపాన్ మోటార్ సైకిళ్ల దిగ్గజం కవాసకి పేరుంగాంచిన నింజా సిరీస్‌లో మరో బైకును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్ మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 5.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

2016 లో జరిగిన ఇంటర్‌మోట్ మోటార్ సైకిల్ షో లో ప్రదర్శించిన అనంతరం 2017 మార్చిలో నింజా 650 బైకును కవాసకి ఇండియన్ మార్కెట్లోకి తొలిసారిగా లాంచ్ చేసింది.

Recommended Video - Watch Now!
[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

మునుపటి వెర్షన్‌తో పోల్చితే నింజా 650 బైకులో చాలా మార్పులు చేసుకున్నాయి. నింజా 650 లైమ్ గ్రీన్ మరియు బ్లాక్ అనే కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా విడుదలైన నింజా 650 కెఆర్‌టి ఎడిషన్‌లో సరికొత్త పెయింట్ స్కీమ్ పరిచయం చేయబడింది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

కవాసకి రేసింగ్ టీమ్ ప్రేరణతో లైమ్ గ్రీన్, గ్రే మరియు బ్లాక్ వంటి ట్రెడిషన్ రంగుల కలయికలో నింజా 650 కెఆర్‌టి ఎడిషన్ బైకులో నూతన పెయింట్ స్కీమ్ అందివ్వడం జరిగింది. అయితే, నూతన కలర్ ఆప్షన్‌లో లభించే ఇది చూడటానికి రెగ్యులర్ వెర్షన్‌ను పోలి ఉంటుంది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

సాంకేతికంగా కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్‍‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది వరకే ఉన్న 649-సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందివ్వడం జరిగింది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

స్లిప్పర్ క్లచ్ సాయంతో స్మూత్‌గా గేర్లను మార్చే వీలున్న 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 65.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

కవాసకి నింజా 650 కెఆర్‌టి బైకును తేలికపాటి బరువున్న ఫ్రేమ్ మీద నిర్మించారు. దీంతో మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే ఇది 22 కిలోల వరకు తేలికగా ఉంటుంది. బరువు తగ్గడంతో బైకు యొక్క లో మరియు మిడల్ రేంజ్ పర్ఫామెన్స్‌ చాలా మెరుగుపడింది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

నింజా 650 వేగాన్ని అదుపు చేయడానికి ముందు వైపున 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌తో పాటు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ తప్పనిసరిగా అందివ్వడం జరిగింది.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

కలర్ ఆప్‌డేట్ మినహాయిస్తే, కెఆర్‌టి ఎడిషన్‌లో మరే ఇతర మార్పులు జరగలేదు. సస్పెన్షన్ విధుల కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

కవాసకి నింజా 650 కెఆర్‌టి ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో బెస్ట్ మోడల్ 2017 కవాసకి నింజా 650. ఇప్పుడు యువ కొనుగోలుదారుల్లో మరింత ఆసక్తిని పెంచుతూ నింజా 650 బైకును కెఆర్‌టి ఎడిషన్‌లో లాంచ్ చేసింది.

సరికొత్త నింజా 650 కెఆర్‌టి ఎడిషన్ విపణిలో ఉన్న హోండా సిబిఆర్ 650ఎఫ్ మరియు బెనెల్లీ టిఎన్‌టి 600ఐ బైకుల నోర్లు మూయించడం ఖాయం. ప్రస్తుతం బుక్ చేసుకునే కస్టమర్లకు ఈ నెల చివరి నుండి డెలివరీ ఇవ్వనుంది.

English summary
Read In Telugu: Kawasaki Ninja 650 KRT Edition Launched In India; Priced At Rs 5.69 Lakh
Story first published: Monday, November 13, 2017, 17:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark