కవాసకి వుల్కన్ ఎస్ 650 బైక్ లాంచ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

కవాసకి ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త వుల్కన్ ఎస్ 650 బైకును లాంచ్ చేసింది. కవాసకి వుల్కన్ ఎస్ 650 బైకు ప్రారంభ ధర రూ. 5.44 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

కవాసకి వుల్కన్ ఎస్ 650

లో ప్రొఫైల్ ఈవెంట‌్‌లో కవాసకి ఇండియా తమ వుల్కన్ ఎస్ 650 బైకును ప్రవేశపెట్టింది. ఈ క్రూయిజర్ బైకును ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించనుంది. వుల్కన్ ఎస్ బైకు మీద కవాసకి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది, ఇది కేవలం ఫ్లాట్ ఎబోనీ కలర్ స్కీములో మాత్రమే లభించనుంది.

Recommended Video - Watch Now!
Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
కవాసకి వుల్కన్ ఎస్ 650

జపాన్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం కవాసకి ఇండియన్ మార్కెట్లోకి తమ తొలి క్రూయిజర్ బైకుగా వుల్కన్ ఎస్ 650 ని లాంచ్ చేసింది. ఇందులో 649-సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ట్విన్ ప్యార్లల్ ఇంజన్ ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 60బిహెచ్‌పి పవర్ మరియు 63ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

కవాసకి వుల్కన్ ఎస్ 650

కవాసకి వుల్కన్ ఎస్ బైకును ఎక్కువ ధృడత్వం గల స్టీల్‌తో తయారు చేసిన డైమండ్ ఫ్రేమ్ మీద నిర్మించింది. దీని మొత్తం బరువు 235కిలోలుగా ఉంది. ఇందులోని ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ తక్కువ వేగం వద్ద కూడా స్మూత్ పర్ఫామెన్స్ మరియు అత్యుత్తమ పనికతీరును ప్రదర్శిస్తుందని కవాసకి పేర్కొంది.

కవాసకి వుల్కన్ ఎస్ 650

కవాసకి వుల్కన్ ఎస్ బైకులో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. రియర్ డిజైన్ బైక్ మొత్తానికి స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చింది. అంతే కాకుండా అతి ముఖ్యమైన, కవాసకి వుల్కన్ ఎస్ రైడ్ చేయాలనుకునే ప్రతి రైడర్ ఎత్తుకు అనుగుణంగా సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే ఎర్గో ఫిట్ అని ఫీచర్ ఇందులో అందించింది.

Trending DriveSpark Telugu:

తొలిసారి పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్

కరిజ్మా బైకును మళ్లీ విడుదలకు సిద్దం చేస్తున్న హీరో

కొత్త కలర్ ఆప్షన్‌లో పట్టుబడిన 2018 బజాజ్ డామినర్

కవాసకి వుల్కన్ ఎస్ 650

సౌకర్యవంతమైన రైడింగ్ కోసం కవాసకి ఎక్కువ శ్రద్ద వహించింది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 250ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అయితే, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందివ్వడం జరిగింది. లాంగ్ రైడింగ్ కోసం 14-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ జోడించింది.

కవాసకి వుల్కన్ ఎస్ 650

వుల్కన్ ఎస్ బైకు విడుదల సందర్భంగా కవాసకి మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ యుటక యమషిత మాట్లాడుతూ, "దేశీయంగా స్పోర్ట్స్ బైకు, నేక్ట్డ్ బైకులు, టూరర్ బైకులు మరియు ఆఫ్ రోడ్ బైకులను పరిచయం చేసిన తరువాత ఇప్పుడు క్రూయిజర్ సెగ్మెంట్లోకి కూడా తమ బైకును ప్రవేశపెట్టినట్లు తెలిపాడు."

కవాసకి వుల్కన్ ఎస్ 650

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఉన్న క్రూయిజర్ బైకుల సెగ్మెంట్లోకి కవాసకి తమ తొలి బైకును లాంచ్ చేసింది. కవాసకి వుల్కన్ ఎస్ 650 క్రూయిజర్ బైకు హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 కు గట్టి పోటీనివ్వనుంది. ప్రస్తుతం దీనిని దిగుమతి చేసుకుని విక్రయించనుంది.

English summary
Read In Telugu: Kawasaki Vulcan S 650 Launched In India; Priced At Rs 5.44 Lakh
Story first published: Saturday, December 30, 2017, 16:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark